కీర్తనలు 38:3-8
కీర్తనలు 38:3-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీ ఉగ్రత వల్ల నా శరీరంలో ఆరోగ్యం లేదు; నా పాపాన్ని బట్టి నా ఎముకల్లో నెమ్మది లేదు. నా దోషం భరించలేని భారంలా నన్ను ముంచెత్తింది. నా బుద్ధిహీనతతో చేసిన పాపాల వల్ల నా గాయాలు కుళ్ళి దుర్వాసన వస్తున్నాయి. నేను చాలా క్రుంగిపోయాను; దినమంతా దుఃఖంలోనే ఉన్నాను. నా వీపు తీవ్రమైన బాధతో ఉంది నా శరీరం అనారోగ్యంతో క్షీణించింది, నేను బలహీనంగా ఉన్నాను పూర్తిగా నలిగిపోయాను; నేను హృదయ వేదనతో మూలుగుతున్నాను.
కీర్తనలు 38:3-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ కోపం వల్ల నా శరీరమంతా అనారోగ్యం కలిగింది. నా పాపం కారణంగా నా ఎముకల్లో ఆరోగ్యం లేకుండా పోయింది. ఎందుకంటే నా దోషాలు నన్ను ముంచెత్తి వేస్తున్నాయి. అవి నేను మోయలేనంత భారంగా ఉన్నాయి. మూర్ఖంగా నేను చేసిన పాపాల వల్ల నాకు కలిగిన గాయాలు కుళ్ళి దుర్వాసన వస్తున్నాయి. నేను పూర్తిగా కుంగిపోయాను. రోజంతా నాకు అవమానం కలుగుతుంది. అవమానం నన్ను ముంచెత్తివేసింది. నా శరీరమంతా రోగగ్రస్థమైంది. నేను మొద్దుబారిపోయాను. పూర్తిగా నలిగిపోయాను. నా హృదయంలోని వేదన కారణంగా మూలుగుతున్నాను.
కీర్తనలు 38:3-8 పవిత్ర బైబిల్ (TERV)
నీవు నన్ను శిక్షించావు. నా శరీరం అంతా బాధగా ఉంది. నేను పాపం చేశాను, నీవు నన్ను శిక్షించావు. అందుచేత నా ఎముకలన్నీ బాధగా ఉన్నాయి. నేను చెడు కార్యాలు చేసిన దోషిని, ఆ దోషం నా భుజాలమీద పెద్ద బరువుగా ఉంది. నేను తెలివితక్కువగా ఉన్నాను. ఇప్పుడు నాకు అవి కంపుకొడ్తున్న పుండ్లు అయ్యాయి. నేను దుఃఖించేవానిలా రోజంతా విచారంగా ఉన్నాను. రోజంతా నేను కృంగిపోయి ఉన్నాను. నా నడుము వేడిగా కాలిపోతోంది. నా శరీరం అంతా బాధగా ఉంది. నేను పూర్తిగా బలహీనంగా ఉన్నాను. నేను బాధతో ఉన్నాను గనుక నేను మూలుగుతున్నాను.
కీర్తనలు 38:3-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీ కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు. నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడి యున్నవి. నా మూర్ఖతవలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదననుబట్టి కేకలు వేయుచున్నాను