కీర్తనలు 38:1-22
కీర్తనలు 38:1-22 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నీవు నన్ను విమర్శించేటప్పుడు కోపగించకు. నీవు నన్ను సరిదిద్దేటప్పుడు కోపగించకుము. యెహోవా, నీవు నన్ను బాధించావు. నీ బాణాలు లోతుగా నాలో గుచ్చుకొన్నాయి. నీవు నన్ను శిక్షించావు. నా శరీరం అంతా బాధగా ఉంది. నేను పాపం చేశాను, నీవు నన్ను శిక్షించావు. అందుచేత నా ఎముకలన్నీ బాధగా ఉన్నాయి. నేను చెడు కార్యాలు చేసిన దోషిని, ఆ దోషం నా భుజాలమీద పెద్ద బరువుగా ఉంది. నేను తెలివితక్కువగా ఉన్నాను. ఇప్పుడు నాకు అవి కంపుకొడ్తున్న పుండ్లు అయ్యాయి. నేను దుఃఖించేవానిలా రోజంతా విచారంగా ఉన్నాను. రోజంతా నేను కృంగిపోయి ఉన్నాను. నా నడుము వేడిగా కాలిపోతోంది. నా శరీరం అంతా బాధగా ఉంది. నేను పూర్తిగా బలహీనంగా ఉన్నాను. నేను బాధతో ఉన్నాను గనుక నేను మూలుగుతున్నాను. ప్రభువా, నీవు నా మూలుగు విన్నావు. నా నిట్టూర్పులు నీకు మరుగు కాలేదు. నా గుండె తడబడుచున్నది. నా బలం పోయింది. నా చూపు దాదాపు పోయింది. నా రోగం మూలంగా నా స్నేహితులు, నా పొరుగువారు నన్ను చూసేందుకు రావటం లేదు. నా కుటుంబం నా దగ్గరకు రాదు. నన్ను చంపగోరేవారు తమ ఉచ్చులను వేసియున్నారు. నాకు హాని చేయగోరేవారు నా నాశనం గూర్చి మాట్లాడుకొంటున్నారు. వారు రోజంతా అబద్ధాలు చెప్తున్నారు. అయితే నేను వినబడని చెవిటివానిలా ఉన్నాను. మాట్లాడలేని మూగవానిలా నేను ఉన్నాను. ఒకని గూర్చి మనుష్యులు చెప్పే మాటలు వినలేని చెవిటివానిలా నేను ఉన్నాను. నేను వాదించి, నా శత్రువులదే తప్పు అని రుజువు చేయలేను. కనుక యెహోవా, నీవు నన్ను కాపాడాలని వేచియుంటాను. నా దేవా, నా ప్రభువా, నా శత్రువులకు సత్యం చెప్పుము. నన్ను చూచి వారిని నవ్వనియ్యవద్దు. నేను తొట్రుపడినప్పుడు వారిని గర్వపడనియ్యవద్దు. నేను పడిపోయేటట్టు ఉన్నాను. నేను నా బాధను మరచిపోలేను. యెహోవా, నేను చేసిన చెడు కార్యాలను గూర్చి, నేను నీకు చెప్పాను. నా పాపాలను గూర్చి నేను విచారిస్తున్నాను. నా శత్రువులు ఇంకా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు, వారు ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారు. నా శత్రువులు నాకు కీడు చేశారు, నేను వారికి మంచి పనులు మాత్రమే చేశాను. మంచి పనులు చేయటానికి మాత్రమే నేను ప్రయత్నించాను. కాని ఆ మనుష్యులు నాకు విరోధం అయ్యారు. యెహోవా, నన్ను విడిచిపెట్టకు. నా దేవా, నాకు సన్నిహితంగా ఉండు. త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము. నా దేవా, నన్ను రక్షించుము.
కీర్తనలు 38:1-22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా, మీ కోపంలో నన్ను గద్దించకండి ఉగ్రతలో నన్ను శిక్షించకండి. మీ బాణాలు నాకు గుచ్చుకున్నాయి, మీ చేయి నా మీద బరువుగా పడింది. మీ ఉగ్రత వల్ల నా శరీరంలో ఆరోగ్యం లేదు; నా పాపాన్ని బట్టి నా ఎముకల్లో నెమ్మది లేదు. నా దోషం భరించలేని భారంలా నన్ను ముంచెత్తింది. నా బుద్ధిహీనతతో చేసిన పాపాల వల్ల నా గాయాలు కుళ్ళి దుర్వాసన వస్తున్నాయి. నేను చాలా క్రుంగిపోయాను; దినమంతా దుఃఖంలోనే ఉన్నాను. నా వీపు తీవ్రమైన బాధతో ఉంది నా శరీరం అనారోగ్యంతో క్షీణించింది, నేను బలహీనంగా ఉన్నాను పూర్తిగా నలిగిపోయాను; నేను హృదయ వేదనతో మూలుగుతున్నాను. ప్రభువా, నా కోరికలన్నీ మీ ముందు ఉన్నాయి; నా నిట్టూర్పు మీ నుండి ఉంది. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నా బలం క్షీణిస్తూ ఉంది; నా కంటి చూపు తగ్గిపోతుంది. నా గాయాల వల్ల నా స్నేహితులు నా సహచరులు నన్ను దూరం పెడుతున్నారు; నా పొరుగువారు నన్ను దూరంగా ఉంచుతున్నారు. నన్ను చంపాలనుకున్నవారు ఉచ్చులు బిగుస్తున్నారు, నాకు హాని కలిగించేవారు నా పతనం గురించి మాట్లాడుతున్నారు; రోజంతా వారు కుట్రలు చేస్తున్నారు. చెవిటివానిలా నేను వినక ఉన్నాను, మూగవానిలా మాట్లాడక ఉన్నాను; నేను వినలేనివానిగా అయ్యాను, జవాబు చెప్పలేనివానిగా ఉన్నాను. యెహోవా, నేను మీ కోసం ఎదురుచూస్తున్నాను; ప్రభువా నా దేవా, మీరు జవాబిస్తారు. నేను, “నా కాలు జారితే వారు సంతోషించవద్దు వారు నాపై రెచ్చిపోవద్దు” అని ప్రార్థించాను. నేను పడిపోయేలా ఉన్నాను, నా బాధ నిత్యం నాతోనే ఉంది. నా దోషాన్ని ఒప్పుకుంటున్నాను; నా పాపాన్ని గురించి బాధపడుతున్నాను. కారణం లేకుండ అనేకులు నాకు శత్రువులయ్యారు; కారణం లేకుండ అనేకులు నన్ను ద్వేషిస్తున్నారు; నేను చేసిన మేలుకు ప్రతిగా వారు నాకు కీడు చేస్తున్నారు, నేను మంచిని మాత్రమే అనుసరిస్తున్నా సరే, వారు నన్ను వ్యతిరేకిస్తున్నారు. యెహోవా, నన్ను విడువకండి; నా దేవా, నాకు దూరంగా ఉండకండి. నా ప్రభువా నా రక్షకా, త్వరగా వచ్చి నాకు సాయం చేయండి.
కీర్తనలు 38:1-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా, నీ కోపంలో నన్ను గద్దించవద్దు. నీ తీవ్ర కోపంలో నన్ను శిక్షించవద్దు. నీ బాణాలు నాకు గట్టిగా గుచ్చుకుంటున్నాయి. నీ చెయ్యి నన్ను అణచివేస్తుంది. నీ కోపం వల్ల నా శరీరమంతా అనారోగ్యం కలిగింది. నా పాపం కారణంగా నా ఎముకల్లో ఆరోగ్యం లేకుండా పోయింది. ఎందుకంటే నా దోషాలు నన్ను ముంచెత్తి వేస్తున్నాయి. అవి నేను మోయలేనంత భారంగా ఉన్నాయి. మూర్ఖంగా నేను చేసిన పాపాల వల్ల నాకు కలిగిన గాయాలు కుళ్ళి దుర్వాసన వస్తున్నాయి. నేను పూర్తిగా కుంగిపోయాను. రోజంతా నాకు అవమానం కలుగుతుంది. అవమానం నన్ను ముంచెత్తివేసింది. నా శరీరమంతా రోగగ్రస్థమైంది. నేను మొద్దుబారిపోయాను. పూర్తిగా నలిగిపోయాను. నా హృదయంలోని వేదన కారణంగా మూలుగుతున్నాను. ప్రభూ, నా హృదయపు లోతుల్లోని తీవ్ర ఆకాంక్షలు నువ్వు అర్థం చేసుకుంటావు. నా మూల్గులు నీకు వినిపిస్తూనే ఉన్నాయి. నా గుండె వేగంగా కొట్టుకుంటున్నది. నా శక్తి క్షీణించిపోతూ ఉంది. నా కంటి చూపు మసకబారుతూ ఉంది. నా ఈ పరిస్థితి కారణంగా నా స్నేహితులూ, తోటివాళ్ళూ నన్ను వదిలేశారు. నా పొరుగువాళ్ళు దూరంగా నిలబడ్డారు. నా ప్రాణం తీయాలని చూసేవాళ్ళు నా కోసం ఉచ్చు బిగిస్తున్నారు. నాకు హాని కలగాలని చూసేవాళ్ళు వినాశకరమైన మాటలు పలుకుతున్నారు. రోజంతా మోసపూరితంగా మాట్లాడుతున్నారు కానీ నేను చెవిటివాడిలాగా ఏమీ వినకుండా ఉన్నాను. మూగవాడిలాగా ఏమీ మాట్లాడకుండా ఉన్నాను. ఏమీ విననివాడిలాగా నేను ఉన్నాను. జవాబు చెప్పలేని వాడిలాగా ఉన్నాను. యెహోవా, నేను తప్పకుండా నీ కోసం వేచి ఉన్నాను. ప్రభూ, నా దేవా, నాకు నువ్వు జవాబిస్తావు. నా శత్రువులు నాపై రెచ్చిపోకుండా ఉండటానికి నేనిది చెప్తున్నాను. నేను కాలు జారితే వాళ్ళు నన్ను భయంకరంగా హింసిస్తారు. నేను పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నిరంతర వేదనలో ఉన్నాను. నా దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నా పాపాన్ని గూర్చి చింతిస్తున్నాను. కానీ నా శత్రువులు అసంఖ్యాకంగా ఉన్నారు. అన్యాయంగా నన్ను ద్వేషించేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వాళ్లకు చేసిన మేలుకు బదులుగా కీడు చేస్తున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినా వాళ్ళు నాపై నిందలు వేస్తున్నారు. యెహోవా, నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నాకు దూరంగా ఉండవద్దు. ప్రభూ, నా రక్షణకి ఆధారమా, త్వరగా వచ్చి నాకు సహాయం చెయ్యి.
కీర్తనలు 38:1-22 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నీవు నన్ను విమర్శించేటప్పుడు కోపగించకు. నీవు నన్ను సరిదిద్దేటప్పుడు కోపగించకుము. యెహోవా, నీవు నన్ను బాధించావు. నీ బాణాలు లోతుగా నాలో గుచ్చుకొన్నాయి. నీవు నన్ను శిక్షించావు. నా శరీరం అంతా బాధగా ఉంది. నేను పాపం చేశాను, నీవు నన్ను శిక్షించావు. అందుచేత నా ఎముకలన్నీ బాధగా ఉన్నాయి. నేను చెడు కార్యాలు చేసిన దోషిని, ఆ దోషం నా భుజాలమీద పెద్ద బరువుగా ఉంది. నేను తెలివితక్కువగా ఉన్నాను. ఇప్పుడు నాకు అవి కంపుకొడ్తున్న పుండ్లు అయ్యాయి. నేను దుఃఖించేవానిలా రోజంతా విచారంగా ఉన్నాను. రోజంతా నేను కృంగిపోయి ఉన్నాను. నా నడుము వేడిగా కాలిపోతోంది. నా శరీరం అంతా బాధగా ఉంది. నేను పూర్తిగా బలహీనంగా ఉన్నాను. నేను బాధతో ఉన్నాను గనుక నేను మూలుగుతున్నాను. ప్రభువా, నీవు నా మూలుగు విన్నావు. నా నిట్టూర్పులు నీకు మరుగు కాలేదు. నా గుండె తడబడుచున్నది. నా బలం పోయింది. నా చూపు దాదాపు పోయింది. నా రోగం మూలంగా నా స్నేహితులు, నా పొరుగువారు నన్ను చూసేందుకు రావటం లేదు. నా కుటుంబం నా దగ్గరకు రాదు. నన్ను చంపగోరేవారు తమ ఉచ్చులను వేసియున్నారు. నాకు హాని చేయగోరేవారు నా నాశనం గూర్చి మాట్లాడుకొంటున్నారు. వారు రోజంతా అబద్ధాలు చెప్తున్నారు. అయితే నేను వినబడని చెవిటివానిలా ఉన్నాను. మాట్లాడలేని మూగవానిలా నేను ఉన్నాను. ఒకని గూర్చి మనుష్యులు చెప్పే మాటలు వినలేని చెవిటివానిలా నేను ఉన్నాను. నేను వాదించి, నా శత్రువులదే తప్పు అని రుజువు చేయలేను. కనుక యెహోవా, నీవు నన్ను కాపాడాలని వేచియుంటాను. నా దేవా, నా ప్రభువా, నా శత్రువులకు సత్యం చెప్పుము. నన్ను చూచి వారిని నవ్వనియ్యవద్దు. నేను తొట్రుపడినప్పుడు వారిని గర్వపడనియ్యవద్దు. నేను పడిపోయేటట్టు ఉన్నాను. నేను నా బాధను మరచిపోలేను. యెహోవా, నేను చేసిన చెడు కార్యాలను గూర్చి, నేను నీకు చెప్పాను. నా పాపాలను గూర్చి నేను విచారిస్తున్నాను. నా శత్రువులు ఇంకా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు, వారు ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారు. నా శత్రువులు నాకు కీడు చేశారు, నేను వారికి మంచి పనులు మాత్రమే చేశాను. మంచి పనులు చేయటానికి మాత్రమే నేను ప్రయత్నించాను. కాని ఆ మనుష్యులు నాకు విరోధం అయ్యారు. యెహోవా, నన్ను విడిచిపెట్టకు. నా దేవా, నాకు సన్నిహితంగా ఉండు. త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము. నా దేవా, నన్ను రక్షించుము.
కీర్తనలు 38:1-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా, కోపోద్రేకముచేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రతచేత నన్ను శిక్షింపకుము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి. నీ చెయ్యి నామీద భారముగా నున్నది. నీ కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు. నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడి యున్నవి. నా మూర్ఖతవలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదననుబట్టి కేకలు వేయుచున్నాను ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి యుండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయెను నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులును నా చెలికాండ్రును నా తెగులు చూచి యెడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడుచేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను –నా కాలు జారినయెడల వారు నామీద అతిశయ పడుదురని నేననుకొనుచున్నాను. ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు నన్నుబట్టి వారు సంతోషించక పోదురుగాక. నేను పడబోవునట్లున్నాను నా మనోదుఃఖము నన్నెన్నడును విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమునుగూర్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైనవారును బలవంతులునైయున్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడుచేయుచున్నారు నేను ఉత్తమమైనదాని ననుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి యెహోవా, నన్ను విడువకుము నా దేవా, నాకు దూరముగా నుండకుము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము.