కీర్తనలు 34:1-3 - Compare All Versions

కీర్తనలు 34:1-3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నేను అన్ని వేళలా యెహోవాను కీర్తిస్తాను; ఆయన స్తుతి నిత్యం నా పెదవులపై ఉంటుంది. నేను యెహోవాలో అతిశయిస్తాను. బాధించబడినవారు ఇది విని సంతోషించుదురు గాక! నాతో కలిసి యెహోవాను మహిమపరచండి; మనం కలసి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం.

షేర్ చేయి
కీర్తనలు 34 TSA

కీర్తనలు 34:1-3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అన్ని సమయాల్లో నేను యెహోవాను స్తుతిస్తాను. నా నోట్లో నిత్యమూ ఆయన స్తుతి ఉంటుంది. నేను యెహోవాను స్తుతిస్తాను. అణచివేతకు గురైన వాళ్ళు అది విని సంతోషిస్తారు గాక! నాతో కలసి యెహోవాను ప్రశంసించండి. మనం అందరం కలసి ఆయన నామాన్ని పైకెత్తుదాం.

షేర్ చేయి
కీర్తనలు 34 IRVTEL

కీర్తనలు 34:1-3 TERV (పవిత్ర బైబిల్)

నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను. ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదాల మీద ఉంటుంది. దీన జనులారా, విని సంతోషించండి. నా ఆత్మ యెహోవాను గూర్చి ఘనంగా కీర్తిస్తుంది. యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి. మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం.

షేర్ చేయి
కీర్తనలు 34 TERV

కీర్తనలు 34:1-3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవానుబట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. నాతోకూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము.

షేర్ చేయి
కీర్తనలు 34 TELUBSI