కీర్తనలు 33:13-15
కీర్తనలు 33:13-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆకాశం నుండి యెహోవా క్రిందకు చూస్తున్నారు ఆయన మనుష్యులందరిని కనిపెడుతున్నారు. ఆయన తన నివాసస్థలం నుండి భూమిపై నివసించే వారందరినీ పరిశీలిస్తున్నారు. అందరి హృదయాలను రూపించింది ఆయనే, వారు చేసే ప్రతిదీ ఆయన గమనిస్తారు.
కీర్తనలు 33:13-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆకాశం నుండి యెహోవా చూస్తున్నాడు. ఆయన మనుషులందర్నీ పరికించి చూస్తున్నాడు. తాను నివాసమున్న చోటు నుండి ఆయన భూమిపై నివసిస్తున్న వాళ్ళందర్నీ చూస్తున్నాడు. అందరి హృదయాలనూ మలచిన వాడు వాళ్ళు చేసే పనులన్నిటినీ గమనిస్తున్నాడు.
కీర్తనలు 33:13-15 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా పరలోకం నుండి క్రిందికి చూసాడు. మనుష్యులందరిని ఆయన చూశాడు. భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరినీ ఆయన తన ఉన్నత సింహాసనం నుండి చూశాడు. ప్రతి మనిషి మనస్సునూ దేవుడు సృష్టించాడు. ప్రతి మనిషి ఏమి చేస్తున్నాడో అది అయన గ్రహిస్తాడు.
కీర్తనలు 33:13-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా ఆకాశములోనుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు. తానున్న నివాసస్థలములోనుండి భూలోక నివాసులందరివైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నియు విచారించువాడు వారిని దర్శించువాడు.