కీర్తనలు 22:6-8
కీర్తనలు 22:6-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నేను మనిషిని కాను ఒక పురుగును, మనుష్యుల చేత తిరస్కరించబడి, ప్రజలచే అవమానించబడ్డాను. నన్ను చూసినవారందరు నన్ను ఎగతాళి చేస్తారు; వారు వెక్కిరిస్తూ, తలలు ఊపుతూ ఎగతాళి చేస్తారు. “వాడు యెహోవాను నమ్మాడు, యెహోవా వాన్ని విడిపించనివ్వండి. అతడు ఆయనలో ఆనందిస్తాడు కాబట్టి, ఆయనే వాన్ని విడిపించనివ్వండి” అని వారంటున్నారు.
కీర్తనలు 22:6-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాని నేను మనిషిని కాదు. పురుగును. మనుషుల ద్వేషం అనుభవించాను, మానవాళికి అవమానంగా ఉన్నాను. నన్ను చూసిన వాళ్ళందరూ నన్ను ఆక్షేపిస్తున్నారు. నన్ను వెక్కిరిస్తూ, నన్ను చూసి తలలు ఆడిస్తున్నారు. అతడు యెహోవాలో నమ్మకం పెట్టుకున్నాడు, యెహోవా అతన్ని రక్షించనివ్వండి. అతడు ఆయనలో ఆనందిస్తున్నాడు గనక యెహోవా అతన్ని రక్షించనివ్వండి, అని వాళ్ళు అంటున్నారు.
కీర్తనలు 22:6-8 పవిత్ర బైబిల్ (TERV)
కాని, నేను మనిషిని కానా, పురుగునా? మనుష్యులు నన్ను దూషిస్తారు. ప్రజలు నన్ను ద్వేషిస్తారు. నన్ను చూచే ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేస్తారు. నన్ను చూచి, వారు తలలు ఎగురవేస్తూ, నన్ను వెక్కిరిస్తారు. వారు నాతో అంటారు: “నీకు సహాయం చేయుమని నీవు యెహోవాను అడగాలి. ఒకవేళ ఆయన నిన్ను రక్షిస్తాడేమో! నీవంటే ఆయనకు అంత ఇష్టమైతే అప్పుడు ఆయన తప్పక నిన్ను రక్షిస్తాడు.”
కీర్తనలు 22:6-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీక రింపబడిన వాడను. నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడిం చుచు నన్ను అపహసించుచున్నారు. –యెహోవామీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వానిని తప్పించు నేమో అందురు.