కీర్తనలు 140:1-13

కీర్తనలు 140:1-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెహోవా, కీడుచేసే మనుష్యుల నుండి నన్ను రక్షించండి; హింసించేవారి నుండి నన్ను కాపాడండి, వారు హృదయాల్లో చెడు విషయాలే కల్పించుకుంటారు రోజు యుద్ధము రేపుతారు. వారు పాము నాలుకలా వారి నాలుకను పదును చేసుకుంటారు; వారి పెదవుల క్రింద సర్పాల విషం ఉంది. సెలా యెహోవా, దుష్టుల చేతుల నుండి నన్ను కాపాడండి; దౌర్జన్యపరుల నుండి నన్ను కాపాడండి, నా కాళ్లను పట్టుకోవాలని పన్నాగాలు చేస్తున్నారు. అహంకారులు చాటుగా వల ఉంచారు; వారు వల దాడులు పరచారు, నా మార్గం వెంట ఉచ్చులు పెట్టారు. సెలా నేను యెహోవాతో, “నా దేవుడు మీరే” అని చెప్తాను. యెహోవా, దయతో మొరను ఆలకించండి. ప్రభువైన యెహోవా, బలాడ్యుడవైన నా రక్షకా, యుద్ధ దినాన మీరు నా తలను రక్షిస్తారు. యెహోవా, దుష్టుల కోరికలను వారికి ఇవ్వకండి; వారి ప్రణాళికలు విజయవంతం కానివ్వకండి. సెలా నన్ను చుట్టుముట్టినవారు గర్వముతో తలలు ఎత్తుతారు; వారి పెదవుల కీడు వారిని మ్రింగివేయాలి. మండుతున్న నిప్పు రవ్వలు వారిపై పడాలి; వారు అగ్నిలో పడవేయబడాలి, తిరిగి లేవకుండా మట్టి గొయ్యిలో పడవేయబడాలి. దూషకులు భూమి మీద స్థిరపడకుందురు గాక; విపత్తులు, దౌర్జన్యపరులను వేటాడతాయి. యెహోవా దరిద్రులకు న్యాయం చేకూరుస్తారని, అవసరతలో ఉన్నవారికి న్యాయం సమకూరుస్తారని నాకు తెలుసు. నిశ్చయంగా నీతిమంతులు మీ నామాన్ని స్తుతిస్తారు, యథార్థవంతులు మీ సన్నిధిలో ఉంటారు.

కీర్తనలు 140:1-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా, దుష్టుల బారి నుండి నన్ను విడిపించు. దుర్మార్గుల చేతుల్లో పడకుండా నన్ను కాపాడు. వాళ్ళు తమ హృదయాల్లో ప్రమాదకరమైన తలంపులు పెట్టుకుంటారు. అన్నివేళలా కలహాలు పుట్టించాలని ఎదురు చూస్తుంటారు. వాళ్ళు పాము నాలుకలాగా తమ నాలుకలు పదును చేసుకుంటారు. వారి పెదాల కింద పాము విషం ఉంచుకుంటారు. సెలా. యెహోవా, దుర్మార్గుల బారిన పడకుండా నన్ను కాపాడు. దౌర్జన్యపరుల చేతిలోనుండి నన్ను రక్షించు. నన్ను పడగొట్టడానికి వాళ్ళు పథకాలు వేస్తున్నారు. గర్వాంధులు నాకోసం బోను పెట్టారు. వాళ్ళు దారి పక్కన వల పరిచారు. నన్ను బంధించడానికి ఉచ్చులు పన్నారు. సెలా. అయితే నేను యెహోవాతో ఇలా మనవి చేసుకుంటున్నాను, యెహోవా, నా దేవుడివి నువ్వే. నా విన్నపాలు ఆలకించు. యెహోవా ప్రభూ, నువ్వే నాకు ఆశ్రయమిచ్చే కోట. యుద్ధ సమయంలో నా తలకు కాపు కాసే వాడివి నువ్వే. యెహోవా, భక్తిహీనుల కోరికలను నేరవేర్చకు. వాళ్ళు మిడిసిపడకుండేలా వాళ్ళ పథకాలు భగ్నం చెయ్యి. సెలా. నా చుట్టూ మూగిన వాళ్ళ తల మీదికి వాళ్ళ మాటల ద్వారా కీడు కలుగు గాక. కణకణలాడే నిప్పులు వాళ్ళపై కురియాలి. వాళ్ళను అగ్నిగుండంలో పడవెయ్యి. ఎన్నటికీ లేవకుండా అగాధంలో పడవెయ్యి. దూషకులకు భూమి మీద భద్రత లేకుండా పోవాలి. దుర్మార్గులను ఆపదలు వెంటాడి పడగొట్టాలి. బాధితుల తరపున యెహోవా వాదిస్తాడనీ. ఆయన దరిద్రులకు న్యాయం చేకూరుస్తాడని నాకు తెలుసు. నీతిపరులు నీ నామానికి కచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. యథార్థవర్తనులు నీ సన్నిధిలో నివసిస్తారు.

కీర్తనలు 140:1-13 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. కృ-రుల నుండి నన్ను కాపాడుము. ఆ మనుష్యులు కీడు పనులు చేయాలని ఆలోచిస్తున్నారు. వాళ్లు ఎల్లప్పుడూ కొట్లాటలు మొదలు పెడ్తారు. వారి నాలుకలు విషసర్పాల నాలుకల్లాంటివి వారి నాలుక క్రింద సర్పవిషం ఉంది. యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. కృ-రుల నుండి నన్ను కాపాడుము. ఆ మనుష్యులు నన్ను తరిమి, బాధించుటకు ప్రయత్నిస్తారు. ఆ గర్విష్ఠులు నా కోసం ఉచ్చు పెడతారు. నన్ను పట్టుకొనేందుకు వాళ్లు వల పన్నుతారు. నా దారిలో వారు ఉచ్చు పెడతారు. యెహోవా, నీవు నా దేవుడవని నీతో చెప్పుకొన్నాను. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవా, నీవు నాకు బలమైన ప్రభువు. నీవు నా రక్షకుడవు. నీవు ఇనుప టోపివలె యుద్ధంలో నా తలను కాపాడుతావు. యెహోవా, ఆ దుర్మార్గులు కోరినట్టుగా వారికి జరగనివ్వవద్దు. వారి పథకాలు నెగ్గనీయకు. యెహోవా, నా శత్రువులను గెలువనియ్యకుము. ఆ మనుష్యులు చెడు కార్యాలు తలపెడుతున్నారు. అయితే ఆ చెడుగులు వారికే సంభవించునట్లు చేయుము. వాళ్ల తలలమీద మండుచున్ననిప్పులు పోయుము. నా శత్రువులను అగ్నిలో పడవేయుము. వారు ఎన్నటికీ ఎక్కిరాలేని గోతిలో వారిని పడవేయుము. యెహోవా, ఆ అబద్దికులను బ్రతుకనియ్యకుము. ఆ దుర్మార్గులకు చెడు సంగతులు జరుగనిమ్ము. పేదవాళ్లకు యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడని నాకు తెలుసు. నిస్సహాయులకు దేవుడు సహాయం చేస్తాడు. యెహోవా, మంచి మనుష్యులు నీ నామాన్ని స్తుతిస్తారు. నీ సన్నిధానంలో వారు నివసిస్తారు.

కీర్తనలు 140:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా, దుష్టుల చేతిలోనుండి నన్ను విడి పింపుము బలాత్కారము చేయువారి చేతిలో పడకుండ నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచ నలు చేయుదురువారు నిత్యము యుద్ధము రేప జూచుచుందురు. పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి చేయుదురువారి పెదవులక్రింద సర్పవిషమున్నది. (సెలా.) యెహోవా, భక్తిహీనులచేతిలోపడకుండ నన్ను కాపాడుము. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దే శించుచున్నారు. గర్విష్ఠులు నాకొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డియున్నారువారు త్రోవప్రక్కను వల పరచియున్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. (సెలా.) అయినను నేను యెహోవాతో ఈలాగు మనవిచేయు చున్నాను –యెహోవా, నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభువైన యెహోవా నా రక్షణదుర్గము యుద్ధదినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుమువారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొన సాగింపకుము. (సెలా.) నన్ను చుట్టుకొనువారు తలయెత్తినయెడలవారి పెదవుల చేటు వారిని ముంచును గాక కణకణలాడు నిప్పులు వారిమీద వేయబడును గాకవారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక అగాధ జలములలోనికి త్రోయబడుదురు గాక కొండెములాడువారు భూమిమీద స్థిరపడకుందురుగాక ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయును గాక. బాధింపబడువారి పక్షమున యెహోవా వ్యాజ్యెమాడు ననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞ తాస్తుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు.