కీర్తనలు 139:1-2 - Compare All Versions

కీర్తనలు 139:1-2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యెహోవా మీరు నన్ను పరిశోధించారు, మీరు నన్ను తెలుసుకొన్నారు. నేను కూర్చోవడం నేను లేవడం మీకు తెలుసు; దూరం నుండే నా తలంపులు మీరు గ్రహించగలరు.

షేర్ చేయి
కీర్తనలు 139 TSA

కీర్తనలు 139:1-2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యెహోవా, నన్ను పరీక్షించి నా గురించి పూర్తిగా తెలుసుకున్నావు. నేను కూర్చోవడం, నా నడక అంతా నీకు తెలుసు. నా మనసులో ఆలోచన పుట్టక ముందే అది నీకు తెలుసు.

షేర్ చేయి
కీర్తనలు 139 IRVTEL

కీర్తనలు 139:1-2 TERV (పవిత్ర బైబిల్)

యెహోవా, నీవు నన్ను పరీక్షించావు. నన్ను గూర్చి నీకు అంతా తెలుసు. నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు. దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.

షేర్ చేయి
కీర్తనలు 139 TERV

కీర్తనలు 139:1-2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.

షేర్ చేయి
కీర్తనలు 139 TELUBSI