కీర్తనలు 11:1-7

కీర్తనలు 11:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా శరణుజొచ్చియున్నాను –పక్షివలె, నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట యేల? దుష్టులు విల్లెక్కుపెట్టి యున్నారు చీకటిలో యథార్థహృదయులమీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించియున్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అస హ్యులు, దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియువారి పానీయభాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించు వాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు.

కీర్తనలు 11:1-7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నేను యెహోవాను ఆశ్రయించాను. “పక్షిలా మీ కొండ మీదికి పారిపో. దుష్టులు తమ విల్లును ఎక్కుపెట్టారు, చీకటిలో పొంచి ఉండి యథార్థ హృదయుల పైకి వేయడానికి బాణాలు సిద్ధం చేస్తున్నారు. పునాదులు నాశనమై పోతుంటే, నీతిమంతులు ఏం చేయగలరు?” అని నాతో మీరెలా అంటారు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నారు; యెహోవా తన పరలోక సింహాసనంపై ఆసీనులై ఉన్నారు; ఆయన భూమి మీద నరులను పరిశీలిస్తున్నారు; ఆయన కళ్లు వారిని పరీక్షిస్తున్నాయి. యెహోవా నీతిమంతులను పరీక్షిస్తారు, కాని దుష్టులను, దౌర్జన్యాన్ని ప్రేమించేవారిని ఆయన అసహ్యించుకుంటారు. దుష్టుల మీద ఆయన నిప్పు కణాలు అగ్ని గంధకం కురిపిస్తారు; వడగాలి వారి భాగం అవుతుంది. యెహోవా నీతిమంతుడు, ఆయన న్యాయాన్ని ప్రేమిస్తారు; యథార్థవంతులు ఆయన ముఖాన్ని చూస్తారు.

కీర్తనలు 11:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నేను యెహోవాలో ఆశ్రయం కోరాను. పక్షిలాగా కొండల్లోకి ఎగిరిపో, అని నువ్వు నా ప్రాణంతో ఎందుకు చెబుతావు? ఎందుకంటే, చూడు! దుర్మార్గులు విల్లెక్కుపెట్టి ఉన్నారు. చీకటిలో యథార్థహృదయుల మీద వెయ్యడానికి తమ బాణాలు వింటి నారికి తగిలించి సిద్ధంగా ఉన్నారు. పునాదులు పాడైపోతే న్యాయవంతులు ఏం చెయ్యగలరు? యెహోవా తన పవిత్రాలయంలో ఉన్నాడు. ఆయన కళ్ళు గమనిస్తున్నాయి. ఆయన కళ్ళు మనుషులను పరిశీలన చేస్తున్నాయి. యెహోవా న్యాయవంతులనూ, దుర్మార్గులనూ, ఇద్దరినీ పరిశీలన చేస్తున్నాడు. హింసించడం పనిగా పెట్టుకున్న వాళ్ళను ఆయన ద్వేషిస్తాడు. దుర్మార్గుల మీద ఆయన రగులుతున్న నిప్పు కణికెలు, అగ్నిగంధకం కురిపిస్తాడు. ఆయన గిన్నెలోని వడగాలి వాళ్ళ పానీయభాగం అవుతుంది. ఎందుకంటే యెహోవా న్యాయవంతుడు. ఆయన నీతిన్యాయాలను ప్రేమిస్తాడు. నిజాయితీపరులు ఆయన ముఖం చూస్తారు.

కీర్తనలు 11:1-7 పవిత్ర బైబిల్ (TERV)

నేను యెహోవాను నమ్ముకొన్నాను గదా! నన్ను పారిపోయి, దాగుకోమని మీరెందుకు నాకు చెప్పారు? “పక్షిలాగ, నీ పర్వతం మీదికి ఎగిరిపో” అని మీరు నాతో చెప్పారు! వేటగానిలా, దుర్మార్గులు విల్లు ఎక్కుపెడ్తారు. వారి బాణాలను వారు గురి చూస్తారు. మరియు చీకటిలోనుండి దుర్మార్గులు నీతి, నిజాయితీగల ప్రజల గుండెల్లోనికి బాణాలు కొట్టుటకు సిద్ధంగా ఉన్నారు. నీతి అంతటిని వారు నాశనం చేస్తే ఏమవుతుంది? అప్పుడు నీతిమంతులు ఏమి చేస్తారు? యెహోవా తన పవిత్ర స్థలంలో ఉన్నాడు. యెహోవా పరలోకంలో తన సింహాసనం మీద కూర్చున్నాడు. మరియు జరిగే ప్రతీది యెహోవా చూస్తున్నాడు. మనుష్యులు మంచివాళ్లో, చెడ్డవాళ్లో చూసేందుకు యెహోవా కళ్లు ప్రజలను నిశితంగా చూస్తాయి. యెహోవా మంచివారి కొరకు అన్వేషిస్తాడు. చెడ్డవాళ్లు ఇతరులను బాధించటానికి ఇష్టపడతారు. కృ-రమైన ఆ మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు. వేడి నిప్పులు, మండుతున్న గంధకం, ఆ దుర్మార్గుల మీద వర్షంలాగ పడేటట్టు యెహోవా చేస్తాడు. ఆ దుర్మార్గులకు లభించేది అంతా మండుతున్న వేడి గాలి మాత్రమే. అయితే దయగల యెహోవా మంచి పనులను చేసే ప్రజలను ప్రేమిస్తాడు. మంచి మనుష్యులు ఆయన ముఖ దర్శనం చేసుకొంటారు.