కీర్తనలు 106:47 - Compare All Versions

కీర్తనలు 106:47 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యెహోవా మాదేవా, మమ్మును రక్షింపుము మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును నిన్ను స్తుతించుచు మేమతిశయించునట్లును అన్యజనులలోనుండి మమ్మును పోగుచేయుము.

షేర్ చేయి
కీర్తనలు 106 TELUBSI

కీర్తనలు 106:47 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యెహోవా మా దేవా, మమ్మల్ని రక్షించు. మేము నీ పరిశుద్ధనామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా, నిన్ను స్తుతిస్తూ మేము గర్వించేలా అన్యజనుల్లో నుండి మమ్మల్ని పోగుచెయ్యి.

షేర్ చేయి
కీర్తనలు 106 IRVTEL

కీర్తనలు 106:47 TERV (పవిత్ర బైబిల్)

మా దేవుడవైన యెహోవా, మమ్ములను రక్షించు. నీ పవిత్ర నామాన్ని స్తుతించగలిగేలా ఈ జనముల మధ్యనుండి మమ్మల్ని సమీకరించుము. అప్పుడు నీకు మేము స్తుతులు పాడగలం.

షేర్ చేయి
కీర్తనలు 106 TERV

కీర్తనలు 106:47 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మా దేవా యెహోవా, మమ్మల్ని రక్షించండి; ఇతర దేశాల మధ్య నుండి మమ్మల్ని సమకూర్చండి, అప్పుడు మేము మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తాం, మిమ్మల్ని స్తుతించడంలో అతిశయిస్తాం.

షేర్ చేయి
కీర్తనలు 106 TSA