కీర్తనలు 103:2-5
కీర్తనలు 103:2-5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, ఆయన ఉపకారాలలో ఏదీ మరచిపోవద్దు. ఆయన నీ పాపాలను క్షమిస్తారు, నీ రోగాలను స్వస్థపరుస్తారు. నరకంలో నుండి నీ ప్రాణాన్ని విడిపిస్తారు నీ తలపై ప్రేమ వాత్సల్య కిరీటం ధరింపచేస్తారు, నీ యవ్వనం గ్రద్ద యవ్వనంలా క్రొత్తగా ఉండేలా, మంచి ఈవులతో నీ కోరికలను తృప్తిపరుస్తారు.
కీర్తనలు 103:2-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలన్నీ మరచిపోవద్దు. ఆయన నీ పాపాలన్నీ క్షమిస్తాడు. నీ జబ్బులన్నీ బాగుచేస్తాడు. నాశనాన్నుంచి నీ ప్రాణాన్ని విడుదల చేస్తాడు. కృప, వాత్సల్యం నీకు కిరీటంగా ఉంచాడు. నీ యవ్వనం గరుడ పక్షిలాగా కొత్తదనం సంతరించుకున్నట్టు మేలైన వాటితో నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు.
కీర్తనలు 103:2-5 పవిత్ర బైబిల్ (TERV)
నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము. ఆయన నిజంగా దయగలవాడని మరచిపోకుము. మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమిస్తున్నాడు. మన రోగాలన్నింటినీ ఆయన బాగుచేస్తున్నాడు. దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తున్నాడు. ఆయన ప్రేమ, జాలి మనకు ఇస్తున్నాడు. దేవుడు మనకు విస్తారమైన మంచి వస్తువులు ఇస్తున్నాడు. ఆయన మనలను యౌవన పక్షిరాజు వలె మరల పడుచువారినిగా చేస్తున్నాడు.
కీర్తనలు 103:2-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించు చున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచు చున్నాడు పక్షిరాజు యౌవనమువలె నీ యౌవనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు