సామెతలు 4:6-7 - Compare All Versions

సామెతలు 4:6-7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నీవు జ్ఞానాన్ని విడచిపెట్టకు, అది నిన్ను కాపాడుతుంది; నీవు దానిని ప్రేమించు, ఆమె నీకు కావలిదానిగా ఉంటుంది. జ్ఞానానికి ఆరంభం ఇది: జ్ఞానం సర్వోన్నతమైనది, దానిని పొందుకో. నీకున్నదంతా ఖర్చైనా సరే, వివేకాన్ని సంపాదించుకో.

షేర్ చేయి
సామెతలు 4 TSA

సామెతలు 4:6-7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

జ్ఞానాన్ని విడిచిపెట్టకుండా ఉంటే అది నిన్ను కాపాడుతుంది. దాన్ని ప్రేమిస్తూ ఉంటే అది నిన్ను రక్షిస్తుంది. జ్ఞానం సంపాదించుకోవడమే బుద్ధి వివేకాలకు మూలం. జ్ఞానం కోసం నీకు ఉన్నదంతా ఖర్చు పెట్టు.

షేర్ చేయి
సామెతలు 4 IRVTEL

సామెతలు 4:6-7 TERV (పవిత్ర బైబిల్)

జ్ఞానమునుండి తొలగిపోవద్దు. అప్పుడు జ్ఞానము నిన్ను కాపాడుతుంది. జ్ఞానాన్ని ప్రేమించు, జ్ఞానము నిన్ను భద్రంగా కాపాడుతుంది. “జ్ఞానము సంపాదించాలని నీవు తీర్మానించినప్పుడే జ్ఞానము మొదలవుతుంది. అందుచేత జ్ఞానము సంపాదించేందుకు నీకున్న సమస్తం వినియోగించు, అప్పుడు నీవు జ్ఞానివి అవుతావు.

షేర్ చేయి
సామెతలు 4 TERV

సామెతలు 4:6-7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము.

షేర్ చేయి
సామెతలు 4 TELUBSI