సామెతలు 24:23-34 - Compare All Versions
సామెతలు 24:23-34 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇవి కూడా జ్ఞానులు చెప్పిన సూక్తులే: న్యాయం తీర్చుటలో పక్షపాతము చూపుట మంచిది కాదు “నీవు అమాయకుడవు” అని దోషులతో చెప్పేవారిని, ప్రజలు శపిస్తారు దేశాలు అసహ్యించుకుంటారు. న్యాయంగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును అధికమైన దీవెన అట్టివారిమీదికి వచ్చును. నిజాయితీగల జవాబు పెదవులపై పెట్టే ముద్దు లాంటిది. ముందుగా నీ బయటి పని చక్క పెట్టుకో నీ పొలాలను సిద్ధపరచుకో; దాని తర్వాత, నీ ఇల్లు కట్టుకో. కారణం లేకుండ నీ పొరుగువానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దు; నీ పెదవులతో తప్పుత్రోవ పట్టిస్తావా? “వారు నాకు చేసినట్లు నేను వారికి చేస్తాను; వారు చేసిన దానికి వారికి తిరిగి చెల్లిస్తాను” అని అనుకోవద్దు. నేను ఒక సోమరివాని చేను దాటి వెళ్లాను, నేను బుద్ధిలేని ఒక వ్యక్తి ద్రాక్షతోటను దాటి వెళ్లాను; అంతట ముళ్ళ కంపలు పెరిగాయి, నేలంతా కలుపు మొక్కల చేత కప్పబడి ఉంది, దాని రాతి గోడ శిథిలావస్థలో ఉంది. నేను దాన్ని చూసి దాని గురించి యోచన చేసి దాని నుండి నేను ఒక పాఠం నేర్చుకున్నాను. ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకు, ఇంకొంచెం సేపు విశ్రాంతి అంటూ చేతులు ముడుచుకుంటాను. పేదరికం నీ మీదికి దొంగలా, లేమి ఆయుధాలు ధరించినవానిలా నీ మీదికి వస్తుంది.
సామెతలు 24:23-34 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఇవి కూడా జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయ తీర్పులో పక్షపాతం ధర్మం కాదు. నీలో దోషం లేదని దుష్టుడితో చెప్పే వాణ్ణి మనుషులు శపిస్తారు. జనం అలాటి వాణ్ణి అసహ్యించుకుంటారు. న్యాయంగా తీర్పు తీర్చే వారికి మేలు కలుగుతుంది. క్షేమకరమైన దీవెన అలాంటి వారి మీదికి వస్తుంది. సరియైన మాటలతో జవాబివ్వడం పెదవులతో ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుంది. బయట పని చక్కబెట్టుకో. ముందుగా పొలంలో సిద్ధపరచుకో. ఆ తరవాత ఇల్లు కట్టుకోవచ్చు. అకారణంగా నీ పొరుగువాడిపై సాక్ష్యం పలక వద్దు. నీ పెదాలతో మోసపు మాటలు పలకొచ్చా? “వాడు నాకు చేసినట్లు వాడికి చేస్తాను. వాడి క్రియ చొప్పున వాడికి ప్రతిఫలం ఇస్తాను” అనుకోవద్దు. సోమరిపోతు చేను నేను దాటి వస్తుంటే తెలివిలేనివాడి ద్రాక్షతోట నేను దాటి వస్తుంటే, ఇదిగో దాన్నిండా ముండ్ల తుప్పలు పెరిగి ఉన్నాయి. ముళ్ళపొదలు వ్యాపించి ఉన్నాయి. దాని రాతి గోడ శిథిలం అయి పోయింది. నేను దాన్ని చూసి ఆలోచించాను. దాన్ని గమనించి బుద్ధి తెచ్చుకున్నాను. మరికాస్త నిద్ర, మరికాస్త కునుకు, నిద్ర పోవడానికి మరికాస్త చేతులు ముడుచు కోవడం, వీటివల్ల నీకు దారిద్రర్యం పరిగెత్తుకుంటూ వస్తుంది ఆయుధం ధరించిన సైనికుడు వచ్చినట్టు లేమి నీమీదికి వస్తుంది.
సామెతలు 24:23-34 TERV (పవిత్ర బైబిల్)
ఇవి జ్ఞానుల మాటలు: ఒక న్యాయమూర్తి న్యాయంగా ఉండాలి. ఒకడు తనకు తెలిసినవాడైనంత మాత్రాన అతడుఆయన అతనిని బలపరచకూడదు. ఒక నేరస్థుడు స్వేచ్చగా వెళ్లిపోవచ్చని గనుక న్యాయమూర్తి చెబితే, అప్పుడు ప్రజలు అతనికి విరోధంగా ఉంటారు. అతని గూర్చి దేశాలే చెడుగా చెప్పుకుంటాయి. అయితే ఒక న్యాయమూర్తి ఒక నేరస్తుని శిక్షిస్తే, అప్పుడు ప్రజలంతా అతనితో కలిసి ఆనందిస్తారు. నిజాయితీగల జవాబు ప్రజలందరికీ సంతోషం కలిగిస్తుంది అది పెదాలమీద ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుంది. నీ పొలంలో నాట్లు వేయక ముందు నీ ఇల్లు కట్టుకోవద్దు. నీవు నివసించేందుకు ఒక గృహం కట్టు కొనకముందే, నీవు ఆహారం పండించటానికి సిద్ధంగా ఉన్నట్టు గట్టిగా తెలుసుకో. గట్టి కారణం లేకుండా ఎవరికీ విరోధంగా మాట్లాడవద్దు. మరియు అబద్దాలు మాట్లాడకు, “అతడు నాకు హాని చేశాడు, గనుక నేను అతనికి అలానే చేస్తాను. అతడు నాకు చేసిన వాటిని బట్టి నేను అతణ్ణి శిక్షిస్తాను” అని చెప్పవద్దు. ఒక సోమరివాని పొలం ప్రక్కగానే నేను నడిచాను. జ్ఞానములేని ఒక మనిషి ద్రాక్షాతోట పక్కగా నేను నడిచాను. ఆ పొలాల నిండా కలుపు మొక్కలు పెరుగుతున్నాయి. నేలమీద పనికిమాలిన మొక్కలు పెరుగుతున్నాయి. పొలాల చుట్టూ గోడ విరిగిపోయి పడిపోతుంది. నేను అది చూచి, దాని గూర్చి ఆలోచించాను. అప్పుడు ఈ విషయాల నుండి నేను ఒక పాఠం నేర్చుకున్నాను. కొంచెం నిద్ర, కొంచెం విశ్రాంతి, నీ చేతులు ముడుచుకొని, ఒక నిద్ర తియ్యటం. ఈ విషయాలు నిన్ను త్వరగా దరిద్రుని చేస్తాయి. నీకు ఏమీ ఉండదు. ఒక దొంగ అకస్మాత్తుగా వచ్చి అంతా దోచుకొని పోయినట్టుగా అది ఉంటుంది.