సామెతలు 24:13-14 - Compare All Versions

సామెతలు 24:13-14 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నా కుమారుడా, తేనె తిను, అది మంచిది; తేనెపట్టు నుండి తేనె తిను అది రుచికి తీపిగా ఉంటుంది. జ్ఞానం నీకు తేనెలాంటిది అని తెలుసుకో: అది నీకు దొరికితే, నీ భవిష్యత్తుకు నిరీక్షణ ఉంటుంది, నీ నిరీక్షణ తొలిగిపోదు.

షేర్ చేయి
సామెతలు 24 TSA

సామెతలు 24:13-14 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

కుమారా, తేనె తాగు. అది రుచికరం. తేనెపట్టునుండి కారే తేనె తినుము అది నీ నాలుకకి మధురం గదా. నీ ఆత్మకు జ్ఞానం అలాటిదని తెలుసుకో. అది నీకు దొరికితే నీకు మంచి భవిషత్తు ఉంటుంది. నీకు ఆశాభంగం కలగదు.

షేర్ చేయి
సామెతలు 24 IRVTEL

సామెతలు 24:13-14 TERV (పవిత్ర బైబిల్)

నా కుమారుడా, తేనె తాగు. అది మంచిది. తేనెపట్టులోని తేనె తియ్యగా ఉంటుంది. అదే విధంగా జ్ఞానము నీ ఆత్మకు మంచిది. నీకు జ్ఞానము ఉంటే, అప్పుడు నీకు ఆశ ఉంటుంది. నీ ఆశకు అంతం ఉండదు.

షేర్ చేయి
సామెతలు 24 TERV

సామెతలు 24:13-14 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నా కుమారుడా, తేనె త్రాగుము అది రుచిగలది గదా తేనెపట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలిసికొనుము అది నీకు దొరికినయెడల ముందుకు నీకు మంచిగతి కలుగును నీ ఆశ భంగము కానేరదు.

షేర్ చేయి
సామెతలు 24 TELUBSI