ఫిలిప్పీయులకు 2:3-4
ఫిలిప్పీయులకు 2:3-4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
స్వార్థపూరిత ఆశలతో లేదా వ్యర్థమైన గర్వంతో ఏమి చేయకండి. దానికి బదులు, వినయంతో ఇతరులకు మీకంటే ఎక్కువ విలువను ఇస్తూ, మీ సొంత పనులపై మాత్రమే ఆసక్తి చూపక, మీలో ప్రతి ఒక్కరు ఇతరుల పనులపై కూడా ఆసక్తి చూపించాలి.
షేర్ చేయి
చదువండి ఫిలిప్పీయులకు 2ఫిలిప్పీయులకు 2:3-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి.
షేర్ చేయి
చదువండి ఫిలిప్పీయులకు 2ఫిలిప్పీయులకు 2:3-4 పవిత్ర బైబిల్ (TERV)
స్వలాభం కోసంగాని, స్వాభిమానం కోసంగాని ఏదీ చేయకండి. వినయంగా ఉండండి. మీరు యితరులకన్నా గొప్ప అని భావించకండి. మీ స్వార్థం కోసం మాత్రమే చూసుకోకుండా యితరుల అవసరాలను కూడా గమనించండి.
షేర్ చేయి
చదువండి ఫిలిప్పీయులకు 2ఫిలిప్పీయులకు 2:3-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తన కంటె యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.
షేర్ చేయి
చదువండి ఫిలిప్పీయులకు 2