Skip to content

సంఖ్యాకాండము 4:5 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 4:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి

సంఖ్యాకాండము 4:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ప్రజలు ప్రయాణానికి సిద్ధమైనప్పుడు అహరోనూ, అతని కుమారులూ గుడారంలోకి వెళ్ళాలి. అక్కడ పరిశుద్ధ స్థలానికీ అతి పరిశుద్ధ స్థలానికీ మధ్యలో ఉన్న అడ్డ తెరలను దించాలి. ఆ తెరలతో నిబంధన శాసనాలున్న మందసం పెట్టెను కప్పాలి.

సంఖ్యాకాండము 4:5 TERV (పవిత్ర బైబిల్)

“ఇశ్రాయేలు ప్రజలు ఒక కొత్త స్థలానికి ప్రయాణం చేసినప్పుడు, అహరోను, అతని కుమారులు సన్నిధి గుడారంలోనికి వెళ్లి, తెరను దించి, దానితో పవిత్ర ఒడంబడిక పెట్టెను కప్పాలి.

సంఖ్యాకాండము 4:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ప్రజలు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు అహరోను అతని కుమారులు లోపలికి వెళ్లి అడ్డతెర దించి నిబంధన మందసం మీద కప్పాలి.