Skip to content

సంఖ్యాకాండము 35:6 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 35:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరియు మీరు లేవీ యులకిచ్చు పురములలో ఆరు ఆశ్రయపురములుండవలెను. నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అవియుగాక నలువదిరెండు పురములను ఇయ్యవలెను.

సంఖ్యాకాండము 35:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మీరు లేవీయులకు ఇచ్చే పట్టణాల్లో ఆరు ఆశ్రయపురాలుండాలి. హత్య చేసినవాడు వాటిలోకి పారిపోగలిగేందుకు వీలుగా వాటిని నియమించాలి. అవి గాక 42 పట్టణాలను కూడా ఇవ్వాలి.

సంఖ్యాకాండము 35:6 TERV (పవిత్ర బైబిల్)

ఆ పట్టణాల్లో ఆరు ఆశ్రయ పురాలుగా ఉంటాయి. ఒక వ్యక్తి ప్రమాద వశాత్తూ మరొకర్ని చంపేస్తే, అప్పుడు అతడు ఆశ్రయంకోసం ఆ పట్టణాలకు పారిపోవచ్చు. ఈ ఆరు పట్టణాలు గాక, ఇంకా 42 పట్టణాలను మీరు లేవీయులకు ఇవ్వాలి.

సంఖ్యాకాండము 35:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“లేవీయులకు ఇచ్చే వాటిలో ఆరు పట్టణాలు ఆశ్రయపురాలుగా ఉండాలి. ప్రమాదవశాత్తు ఎవరినైనా చంపితే ఆ వ్యక్తి ఇక్కడకు పారిపోవచ్చు. వీటితో సహా 42 పట్టణాలు వారికి ఇవ్వాలి.