Skip to content

సంఖ్యాకాండము 35:28 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 35:28 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఏలయనగా ప్రధానయాజకుడు మృతినొందువరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను. ప్రధానయాజకుడు మృతినొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశమునకు తిరిగి వెళ్లవచ్చును.

సంఖ్యాకాండము 35:28 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఎందుకంటే, ప్రధాన యాజకుడు చనిపోయే వరకూ అతడు ఆశ్రయపురంలోనే నివసించాలి. ఆ ప్రధాన యాజకుడు చనిపోయిన తరువాత ఆ నరహంతకుడు తన వారసత్వం ఉన్న దేశానికి తిరిగి వెళ్లవచ్చు.

సంఖ్యాకాండము 35:28 TERV (పవిత్ర బైబిల్)

ప్రమాదవశాత్తూ చంపిన వ్యక్తి, ప్రధాన యాజకుడు మరణించేంతవరకు తన ‘ఆశ్రయ పురం’లోనే ఉండాలి. ప్రధాన యాజకుడు మరణించాక, అతడు తిరిగి తన చోటికి వెళ్లవచ్చును.

సంఖ్యాకాండము 35:28 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ప్రధాన యాజకుడు చనిపోయే వరకు నిందితుడు ఆశ్రయపురం లోనే ఉండాలి. ఆ తర్వాత అతడు తన స్వస్థలానికి వెళ్లిపోవచ్చు.