సంఖ్యాకాండము 32:7 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 32:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా ఇశ్రాయేలీయులకిచ్చిన దేశమునకు వారు వెళ్లకయుండునట్లు మీరేల వారి హృదయములను అధైర్య పరచుదురు?
సంఖ్యాకాండము 32:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన దేశానికి వెళ్ళకుండా మీరు వారి హృదయాలను ఎందుకు నిరుత్సాహ పరుస్తున్నారు?
సంఖ్యాకాండము 32:7 TERV (పవిత్ర బైబిల్)
ఇశ్రాయేలు ప్రజలను మీరెందుకు అధైర్యపరుస్తున్నారు? నది దాటకుండా, యెహోవా వారికి ఇచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోకుండా చేస్తారు మీరు.
సంఖ్యాకాండము 32:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“యెహోవా ఇచ్చిన దేశానికి ప్రయాణమై వెళ్తున్న ఇశ్రాయేలీయులను ఎందుకు నిరాశపరుస్తారు?