Skip to content

సంఖ్యాకాండము 30:6 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 30:3-6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి యింటనుండగా యెహోవాకు మ్రొక్కుకొని బద్ధురా లైనయెడల, ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలుగజేసికొనిన బాధ్యతను విని దానిగూర్చి ఊరకొనినయెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినినదినమున ఆక్షేపణచేసినయెడల, ఆమె మ్రొక్కుబడులలో ఏదియు, ఆమె తనమీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియు నిలువకపోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణచేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును.

సంఖ్యాకాండము 30:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆమె తండ్రి దానికి ఆక్షేపణ తెలిపాడు కాబట్టి యెహోవా ఆమెను క్షమిస్తాడు.

సంఖ్యాకాండము 30:6 TERV (పవిత్ర బైబిల్)

“మరియు ఒకని భార్య యెహోవాకు ఏదో ఇస్తానని ఒక ప్రత్యేక ప్రమాణం చేసి ఉండొచ్చు.

సంఖ్యాకాండము 30:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“ఆమె మ్రొక్కుబడి చేసుకున్న తర్వాత లేదా అవివేకంగా ప్రమాణం చేసిన తర్వాత ఆమె పెళ్ళి చేసుకుంటే