Skip to content

సంఖ్యాకాండము 30:4 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 30:3-6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి యింటనుండగా యెహోవాకు మ్రొక్కుకొని బద్ధురా లైనయెడల, ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలుగజేసికొనిన బాధ్యతను విని దానిగూర్చి ఊరకొనినయెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినినదినమున ఆక్షేపణచేసినయెడల, ఆమె మ్రొక్కుబడులలో ఏదియు, ఆమె తనమీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియు నిలువకపోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణచేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును.

సంఖ్యాకాండము 30:4 TERV (పవిత్ర బైబిల్)

ఆ ప్రమాణం గూర్చి ఆమె తండ్రి విని, ఒప్పుకొంటే, ఆ యువతి ప్రమాణం ప్రకారం చేసి తీరాలి.

సంఖ్యాకాండము 30:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

తన తండ్రి దాన్ని గురించి వినిన తర్వాత తనను ఏమి అనకపోతే అప్పుడు ఆ యువతి మ్రొక్కుబళ్ళు లేదా తాను చేసిన ప్రతి ప్రతిజ్ఞ నిలుస్తుంది.