సంఖ్యాకాండము 3:40 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 3:40 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులలో ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల తొలిచూలియైన ప్రతిమగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము.
సంఖ్యాకాండము 3:40 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తరువాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు “ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానం అయిన పురుషులను ఒక నెల, ఆ పై వయసున్న వారిందర్నీ లెక్క పెట్టు. వారి పేర్లు రాయి.
సంఖ్యాకాండము 3:40 TERV (పవిత్ర బైబిల్)
మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయులలో ఒక నెలగాని అంతకంటె ఎక్కువగాని వయసుగల మొదట పుట్టిన బాలురను, పురుషులను అందరినీ లెక్కించు, వారి పేర్ల జాబితా ఒకటి తయారుచేయి.
సంఖ్యాకాండము 3:40 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా మోషేతో, “ఒక నెల లేదా ఆపై వయస్సున్న ఇశ్రాయేలీయుల తొలిసంతానమైన మగవారిని లెక్కించండి, వారి పేర్ల జాబితాను తయారుచేయండి.