Skip to content

సంఖ్యాకాండము 25:3 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 25:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోపము రగులుకొనెను.

సంఖ్యాకాండము 25:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఇశ్రాయేలీయులు బయల్పెయోరును ఆరాధించిన కారణంగా యెహోవా కోపం వారి మీద రగులుకుంది.

సంఖ్యాకాండము 25:2-3 TERV (పవిత్ర బైబిల్)

మోయాబీ స్త్రీలు వారి నకిలీ దేవుళ్లకు బలులు అర్పించేటప్పుడు వచ్చి సహాయం చేయుమని ఆ పురుషులను అహ్యానించారు. యూదులు కొంతమంది ఆ దేవుళ్లను కొలిచి, అక్కడ భోజనం చేసారు. కనుక ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు పెయోరులో బయలు దేవతను కొలవటం మొదలు పెట్టారు. యెహోవాకు ఈ ప్రజలమీద చాల కోపం వచ్చింది.

సంఖ్యాకాండము 25:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాబట్టి ఇశ్రాయేలు బయల్-పెయోరును పూజించడంలో వారితో కలిసిపోయారు యెహోవా కోపం వారిపై రగులుకుంది.