సంఖ్యాకాండము 24:7 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 24:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీళ్లు అతని బొక్కెనలనుండి కారును అతని సంతతి బహు జలములయొద్ద నివసించును అతనిరాజు అగగుకంటె గొప్పవాడగును అతని రాజ్యము అధికమైనదగును.
సంఖ్యాకాండము 24:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అతడు నీరు తోడుకునే చేదల నుండి నీళ్ళు కారుతాయి. అతడు నాటిన విత్తనానికి సమృద్ధిగా నీళ్ళు అందుతాయి. వారి రాజు అగగు కంటే గొప్పవాడౌతాడు. వారి రాజ్యం ఘనత పొందుతుంది.
సంఖ్యాకాండము 24:7 TERV (పవిత్ర బైబిల్)
మీకు ఎల్లప్పుడూ తాగటానికి కావాల్సినంత నీరు ఉంటుంది. మీ ఆహారం పండించుకోవటానికి కావాల్సినంత నీరు ఎల్లప్పుడూ ఉంటుంది మీకు. ఆ ప్రజల రాజు అగాగుకంటె గొప్పవాడుగా ఉంటాడు. వారి రాజ్యం చాలా గొప్పది అవుతుంది.
సంఖ్యాకాండము 24:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వాటి బొక్కెనల నుండి నీళ్లు పారుతున్నాయి; వాటి విత్తనాలకు సమృద్ధిగా నీళ్లుంటాయి. “వారి రాజు అగగు కంటే గొప్పవాడు; వారి రాజ్యం హెచ్చింపబడుతుంది.