నహూము 2:3 - అన్ని సంస్కరణలను పోల్చండి
నహూము 2:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయన బలాఢ్యుల డాళ్లు ఎరుపాయెను, పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొనియున్నారు, ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరయుచున్నవి, సరళదారుమయమైన యీటెలు ఆడుచున్నవి
నహూము 2:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆయన శూరుల డాళ్లు ఎర్రగా ఉన్నాయి. పరాక్రమశాలురు ఎర్రని వస్త్రాలు ధరించుకుని ఉన్నారు, వ్యూహాలు పన్నే రోజున ఆయన సైన్యం, రథాలు మెరుగు పెట్టిన ఉక్కులాగా మెరిసిపోతున్నాయి. సరళవృక్షం కలపతో చేసిన ఈటెలను వీరులు అటూ ఇటూ ఊపుతున్నారు.
నహూము 2:3 TERV (పవిత్ర బైబిల్)
ఆ సైనికుల డాళ్లు ఎర్రగా ఉన్నాయి. వారి దుస్తులు మిరుమిట్లు గొలిపేటంత ఎర్రగా ఉన్నాయి. వారి రథాలు యుద్ధానికి బారులు తీర్చబడి, అగ్ని శిఖల్లా మెరుస్తున్నాయి. వారి గుర్రాలు స్వారీకి సిద్ధంగా ఉన్నాయి!
నహూము 2:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సైనికుల డాళ్లు ఎర్రగా ఉన్నాయి; యోధులు ఎరుపు దుస్తులు ధరించారు. వారు సిద్ధపడిన రోజున రథాలపై ఉన్న లోహం మెరుస్తుంది; సరళవృక్షంతో చేసిన ఈటెలు ఆడుతున్నాయి.