మత్తయి 26:73 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 26:73 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురునొద్దకు వచ్చి–నిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నదని అతనితో చెప్పిరి.
షేర్ చేయి
మత్తయి 26 TELUBSIమత్తయి 26:73 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కొంతసేపటి తరువాత అక్కడ నిలబడిన కొందరు పేతురు దగ్గరికి వచ్చి, “నిజమే, నువ్వు కూడా వారిలో ఒకడివే. నీ మాట్లాడే విధానం వల్ల అది తెలిసిపోతున్నది” అన్నారు.
షేర్ చేయి
మత్తయి 26 IRVTELమత్తయి 26:73 TERV (పవిత్ర బైబిల్)
కొద్ది సేపయ్యాక అక్కడ నిలుచున్న వాళ్ళు పేతురు దగ్గరకు వచ్చి, “నీవు తప్పకుండా వాళ్ళలో ఒకడివి. నీ మాట తీరు చూస్తేనే తెలిసిపోతుంది!” అని అన్నారు.
షేర్ చేయి
మత్తయి 26 TERVమత్తయి 26:73 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కొంతసేపటి తర్వాత, అక్కడ నిలబడినవారు పేతురు దగ్గరకు వెళ్లి, “ఖచ్చితంగా నీవు కూడ వారిలో ఒకడివి; నీ మాట తీరే చెప్తుంది” అన్నారు.
షేర్ చేయి
మత్తయి 26 TSA