Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 26:31 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 26:31 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అప్పుడు యేసు వారిని చూచి–ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలయనగా– గొఱ్ఱెల కాపరిని కొట్టుదును, మందలోని గొఱ్ఱెలు చెదరిపోవును అని వ్రాయబడి యున్నది గదా.

షేర్ చేయి
మత్తయి 26 TELUBSI

మత్తయి 26:31 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అప్పుడు యేసు వారితో, “ఈ రాత్రి మీరంతా నా విషయంలో తొట్రుపడతారు. ఎందుకంటే, ‘కాపరిని దెబ్బ తీస్తాను, మందలోని గొర్రెలు చెదరిపోతాయి’ అని రాసి ఉంది కదా!

షేర్ చేయి
మత్తయి 26 IRVTEL

మత్తయి 26:31 TERV (పవిత్ర బైబిల్)

ఆ తదుపరి యేసు వాళ్ళతో, “ఈ రాత్రి మీరు నా కారణంగా చెదరిపోతారు. ఎందుకంటే: ‘నేను గొఱ్ఱెల కాపరిని చంపుతాను అప్పుడా గొఱ్ఱెల మంద చెదరిపోతుంది’ అని వ్రాయబడివుంది.

షేర్ చేయి
మత్తయి 26 TERV

మత్తయి 26:31 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అప్పుడు యేసు వారితో, “నన్ను బట్టి ఈ రాత్రి మీరందరు చెదరిపోతారు ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది: “ ‘నేను గొర్రెల కాపరిని కొడతాను, అప్పుడు మందలోని గొర్రెలు చెదిరిపోతాయి.’

షేర్ చేయి
మత్తయి 26 TSA