మత్తయి 12:32 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 12:32 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.

షేర్ చేయి
మత్తయి 12 TELUBSI

మత్తయి 12:32 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ దొరుకుతుందిగానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి, ఈ లోకంలోగానీ రాబోయే లోకంలోగానీ క్షమాపణ ఉండదు.

షేర్ చేయి
మత్తయి 12 IRVTEL

మత్తయి 12:32 TERV (పవిత్ర బైబిల్)

మనుష్యకుమారుణ్ణి దూషిస్తూ మాట్లాడిన వాణ్ణి దేవుడు క్షమిస్తాడు. కాని పవిత్రాత్మను దూషిస్తూ మాట్లాడిన వాణ్ణి ఈయుగంలో కాని, లేక రానున్న యుగంలో కాని క్షమించడు.

షేర్ చేయి
మత్తయి 12 TERV

మత్తయి 12:32 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మనుష్యకుమారునికి విరోధంగా మాట్లాడే వారికైనా క్షమాపణ ఉంది కానీ, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ ఈ యుగంలో కానీ రాబోయే యుగంలో కానీ ఉండదు.

షేర్ చేయి
మత్తయి 12 TSA