మత్తయి 1:18-19
మత్తయి 1:18-19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యేసు క్రీస్తు పుట్టుక ఇలా జరిగింది: ఆయన తల్లియైన మరియ యోసేపుకు ప్రధానం చేయబడింది. కానీ వారిద్దరు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. అయితే ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడు కాబట్టి ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు.
మత్తయి 1:18-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు క్రీస్తు పుట్టుక వివరం. ఆయన తల్లి మరియకు యోసేపుతో ప్రదానం అయింది కానీ వారు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమె భర్త యోసేపు నీతిపరుడు. అందువల్ల అతడు ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దామనుకున్నాడు.
మత్తయి 1:18-19 పవిత్ర బైబిల్ (TERV)
యేసు క్రీస్తు జననం ఇలా సంభవించింది: యేసు క్రీస్తు తల్లి మరియకు, యోసేపు అనే వ్యక్తికి వివాహం నిశ్చయమై ఉంది. వివాహంకాకముందే పవిత్రాత్మ శక్తి ద్వారా మరియ గర్భవతి అయింది. కాని ఆమె భర్త యోసేపు నీతిమంతుడు. అందువల్ల అతడు అమెను నలుగురిలో అవమాన పరచదలచుకోలేదు. ఆమెతో రహస్యంగా తెగతెంపులు చేసుకోవాలని మనస్సులో అనుకొన్నాడు.
మత్తయి 1:18-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యేసు క్రీస్తు జననవిధమెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.