లేవీయకాండము 23:41 - Compare All Versions

లేవీయకాండము 23:41 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ప్రతి సంవత్సరం ఈ పండుగ యెహోవా కోసం ఏడు రోజులు మీరు ఆచరించాలి. ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది; దీనిని ఏడవ నెలలో ఆచరించాలి.

లేవీయకాండము 23:41 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అలా మీరు ఏటేటా ఏడు రోజులు యెహోవాకు పండగగా ఆచరించాలి. ఇది మీ తరతరాలకు నిత్యమైన శాసనం. ఏడవ నెలలో దాన్ని ఆచరించాలి.

లేవీయకాండము 23:41 TERV (పవిత్ర బైబిల్)

ప్రతి సంవత్సరం ఏడు రోజులు యెహోవాకు పండుగగా మీరు దీనిని ఆచరించాలి. ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. ఏడవ నెలలో మీరు ఈ పండుగను ఆచరించాలి.

లేవీయకాండము 23:41 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అట్లు మీరు ఏటేట ఏడు దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. ఏడవ నెలలో దానిని ఆచరింపవలెను.