లేవీయకాండము 23:26-32

లేవీయకాండము 23:26-32 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెహోవా మోషేతో అన్నారు, “ఈ ఏడవ నెల పదవ రోజు ప్రాయశ్చిత్త దినము. పరిశుద్ధ సభ నిర్వహించి, మీరు ఉపవాసముండాలి, యెహోవాకు హోమబలి సమర్పించాలి. ఆ రోజు ఎలాంటి పని చేయకూడదు, ఎందుకంటే అది ప్రాయశ్చిత్త దినం, మీ దేవుడైన యెహోవా ఎదుట మీ కోసం ప్రాయశ్చిత్తం చేయబడుతుంది. ఆ రోజున తమను తాము ఉపేక్షించుకొనని వారు తమ ప్రజల నుండి తొలగించబడాలి. ఆ రోజు ఎవరైనా పని చేస్తే, వారని తమ ప్రజల నుండి నిర్మూలం చేస్తాను. మీరు ఏ పని చేయకూడదు. మీరు ఎక్కడున్నా, రాబోయే తరాలకు ఇది నిత్య కట్టుబాటుగా ఉంటుంది. అది మీకు సబ్బాతు విశ్రాంతి దినం, మీరు ఉపవాసముండాలి. ఆ నెల తొమ్మిదవ రోజు సాయంత్రం నుండి మర్నాడు సాయంత్రం వరకు సబ్బాతును ఆచరించాలి.”

లేవీయకాండము 23:26-32 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. “ఈ ఏడో నెల పదవ రోజు పాపానికి ప్రాయశ్చిత్తం చేసే రోజు. అ రోజున మీరు పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకుని యెహోవాకు హోమం చేయాలి. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిలో మీరు మీ కోసం ప్రాయశ్చిత్తం చేసుకోడానికి అది ప్రాయశ్చిత్త దినం. ఆ రోజున తనను దుఃఖపరుచుకోకుండా ఉండే ప్రతివాణ్ణి తన ప్రజల్లో లేకుండా చెయ్యాలి. ఆ రోజున ఏ పని అయినా చేసే ప్రతివాణ్ణి తన ప్రజల్లో ఉండకుండాా నాశనం చేస్తాను. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. అది మీ నివాసాలన్నిటిలో మీ తరతరాలకు నిత్య శాసనం. అది మీకు మహా విశ్రాంతి దినం. అ రోజున మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాలి. ఆ నెల తొమ్మిదో రోజు సాయంత్రం మొదలు మరుసటి సాయంత్రం వరకూ మీరు విశ్రాంతి దినంగా ఆచరించాలి.”

లేవీయకాండము 23:26-32 పవిత్ర బైబిల్ (TERV)

మోషేతో యెహోవా చెప్పాడు, “ఏడవ నెల పదవరోజు ప్రాయశ్చిత్త దినంగా ఉంటుంది. ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. మీరు భోజనం చేయకూడదు, యెహోవాకు మీరు హోమ అర్పణ తీసుకొని రావాలి. ఆ రోజున మీరు ఏ పని చేయకూడదు. ఎందుచేతనంటే అది ప్రాయశ్చిత్త దినం. ఆ రోజు, యాజకులు యెహోవా ఎదుటికి వెళ్లి, మిమ్మల్ని పవిత్రం చేసే ఆచారక్రమాన్ని జరిగిస్తారు. “ఆ రోజున భోజనం చేయకుండా ఉండేందుకు ఎవరైనా తిరస్కరిస్తే, ఆ వ్యక్తిని తన ప్రజలనుండి వేరు చేయాలి. ఆ రోజున ఎవరైనా పని చేస్తే ఆ వ్యక్తిని తన ప్రజల్లోనుంచి నేను నాశనం చేస్తాను. మీరు అసలు ఏమీ పని చేయాకూడదు. మీరు ఎక్కడ నివసించినా ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. అది మీకు ఒక ప్రత్యేక విశ్రాంతి దినం. మీరు భోజనం చేయకూడదు. నెలలో తొమ్మిదవ రోజు తర్వాత సాయంకాలంనుండి ఈ ప్రత్యేక విశ్రాంతి దినం మీరు ప్రారంభించాలి. ఆ సాయంత్రంనుండి మర్నాటి సాయంకాలం వరకు ఈ ప్రత్యేక విశ్రాంతి దినం కొనసాగుతుంది.”

లేవీయకాండము 23:26-32 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. –ఈ యేడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము; అందులో మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు; మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసికొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తన్నుతాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పనినైననుచేయు ప్రతివానిని వాని ప్రజలలోనుండకుండ నాశము చేసెదను. అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహా విశ్రాంతిదినము, మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల తొమ్మిదవనాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలమువరకు మీరు విశ్రాంతిదినముగా ఆచరింపవలెను.