లేవీయకాండము 2:5 - అన్ని సంస్కరణలను పోల్చండి
లేవీయకాండము 2:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ అర్పణము పెనముమీద కాల్చిన నైవేద్యమైనయెడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైన గోధుమపిండిదై యుండవలెను.
లేవీయకాండము 2:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఒకవేళ నీ అర్పణ పెనం మీద కాల్చిన నైవేద్యమైతే అది పొంగజేసే పదార్ధం లేకుండా సన్నని పిండితో, నూనె రాసి చేసినదై ఉండాలి.
లేవీయకాండము 2:5 TERV (పవిత్ర బైబిల్)
పెనం మీద కాల్చబడిన ధాన్యార్పణ నీవు తెస్తే అది నూనెతో కలిపిన పొంగని మంచి పిండి కావాలి.
లేవీయకాండము 2:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఒకవేళ మీ భోజనార్పణ పెనం మీద కాల్చినదైతే, అది నాణ్యమైన పిండిలో నూనె కలిపి, పులుపు లేకుండ చేయబడాలి.