యెహోషువ 24:1-4

యెహోషువ 24:1-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారినందరిని షెకెములో పోగుచేసి, వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లనెను–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా చెప్పునదేమనగా–ఆదికాలమునుండి మీపితరులు, అనగా అబ్రాహాముకును నాహోరుకును తండ్రియైన తెరహు కుటుంబికులు నది (యూఫ్రటీసు) అద్దరిని నివసించి యితర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరినుండి మీపితరుడైన అబ్రాహామును తోడుకొని వచ్చి కనాను దేశమందంతట సంచరింపజేసి, అతనికి సంతానమును విస్తరింపజేసి, అతనికి ఇస్సాకును ఇచ్చితిని. ఇస్సాకునకు నేను యాకోబు ఏశావుల నిచ్చితిని. శేయీరు మన్యములను స్వాధీనపరచుకొనునట్లు వాటిని ఏశావు కిచ్చితిని. యాకోబును అతని కుమారులును ఐగుప్తులోనికి దిగిపోయిరి.

యెహోషువ 24:1-4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

తర్వాత యెహోషువ ఇశ్రాయేలు గోత్రాలన్నిటిని షెకెములో సమావేశపరిచాడు. అతడు ఇశ్రాయేలు పెద్దలను, నాయకులను, న్యాయాధిపతులను, అధికారులను పిలిపించాడు, వారు వచ్చి దేవుని ముందు నిలబడ్డారు. యెహోషువ ప్రజలందరితో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘చాలా కాలం క్రితం అబ్రాహాము, నాహోరుల తండ్రియైన తెరహుతో సహా మీ పూర్వికులు యూఫ్రటీసు నది అవతల నివసించి ఇతర దేవుళ్ళను ఆరాధించారు. అయితే నేను మీ తండ్రి అబ్రాహామును యూఫ్రటీసు అవతల ఉన్న దేశం నుండి తీసుకువచ్చి కనానుకు నడిపించి, అతనికి చాలామంది సంతానాన్ని ఇచ్చాను. అయితే నేను అతనికి ఇస్సాకును ఇచ్చాను, ఇస్సాకుకు యాకోబును, ఏశావును ఇచ్చాను. నేను శేయీరు కొండ ప్రాంతాన్ని ఏశావుకు స్వాధీనపరచుకోడానికి ఇచ్చాను, అయితే యాకోబు, అతని కుటుంబం ఈజిప్టుకు వెళ్లిపోయారు.

యెహోషువ 24:1-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటినీ షెకెంలో పోగుచేసి, వారి పెద్దలనూ అధికారులనూ న్యాయాధిపతులనూ నాయకులనూ పిలిపించినపుడు వారు దేవుని సన్నిధిలో హాజరయ్యారు. యెహోషువ ప్రజలందరితో ఇలా అన్నాడు “ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా ఇలా చెబుతున్నాడు, మునుపు మీ పూర్వీకులు, అబ్రాహాము నాహోరుల తండ్రి తెరహు, యూఫ్రటీసు నది అవతల నివసించి, ఇతర దేవుళ్ళను పూజించేవారు. అయితే నేను నది అవతల నుండి మీ పూర్వీకుడు అబ్రాహామును కనాను దేశానికి తీసుకొచ్చి, ఇస్సాకు ద్వారా అతని సంతానాన్ని విస్తరింపజేశాను. ఇస్సాకుకు నేను యాకోబునూ ఏశావునూ ఇచ్చాను. శేయీరు కొండప్రాంతాలను స్వాధీనపరచుకొనేలా ఏశావుకిచ్చాను. అయితే యాకోబు అతని కుమారులు దిగువనున్న ఐగుప్తుకు వెళ్ళారు.

యెహోషువ 24:1-4 పవిత్ర బైబిల్ (TERV)

అప్పుడు ఇశ్రాయేలీయుల వంశాలన్ని షెకెములో సమావేశం అయ్యాయి. వారందరినీ యెహోషువ అక్కడికి పిలిచాడు. అప్పుడు ఇశ్రాయేలు నాయకులను, కుటుంబ పెద్దలను, న్యాయమూర్తులను యెహోషువ పిలిచాడు. వీళ్లంతా దేవుని ఎదుట నిలబడ్డారు. అప్పుడు యెహోషువ ప్రజలందరితో మాట్లాడాడు. అతడు ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మీతో చెబుతున్నదే నేను మీతో చెబుతున్నాను. చాలకాలం క్రిందట మీ పూర్వీకులు యూఫ్రటీసు నదికి ఆవలిపక్క నివసించారు. అబ్రాహాము, నాహోరుల తండ్రి తెరహు వంటి మనుష్యులను గూర్చి నేను చెప్పుచున్నాను. అప్పట్లో వాళ్లు ఇతర దేవుళ్లను పూజించారు. అయితే యెహోవానైన నేను మీ తండ్రి అబ్రాహామును నది ఆవలివైపు దేశంనుండి బయటకు రప్పించాను. నేను అతనిని కనాను దేశంగుండా నడిపించి, అతనికి అనేకమంది పిల్లల్ని ఇచ్చాను. అబ్రాహాముకు ఇస్సాకు అనే కొడుకును నేను ఇచ్చాను. మరియు ఇస్సాకునకు యాకోబు, ఏశావు అనే ఇద్దరు కొడుకులను నేను ఇచ్చాను. శేయీరు చుట్టూరా ఉన్న పర్వతాలను నేను ఏశావుకు ఇచ్చాను. కానీ యాకోబు, అతని కొడుకులు అక్కడ నివసించలేదు. బ్రతికేందుకు వారు ఈజిప్టు వెళ్లారు.