యెహోషువ 22:26 - అన్ని సంస్కరణలను పోల్చండి
యెహోషువ 22:26 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి మేము–మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పు కొంటిమి; అది దహనబలులనర్పించుటకైనను బలినర్పిం చుటకైనను కాదు.
యెహోషువ 22:26 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి మేము, ‘మనం బలిపీఠం కట్టుకుందాం. అది దహనబలులకూ మరి ఎలాటి బలులకూ కాదు.
యెహోషువ 22:26 TERV (పవిత్ర బైబిల్)
“అందుచేత మేము ఈ బలిపీఠం నిర్మించాలని నిర్ణయించాం. అంతేగాని దీనిని దహనబలులకు, బలులకు ఉపయోగించాలని మేము తలంచలేదు.
యెహోషువ 22:26 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“అందుకే మేము, ‘మనం బలిపీఠం కట్టడానికి సిద్ధపడదాం రండి, అయితే అది దహనబలులు బలులు అర్పించడం కోసం కాదు’ అని అనుకున్నాము.