Skip to content

యెహోషువ 2:22 - అన్ని సంస్కరణలను పోల్చండి

యెహోషువ 2:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వారు వెళ్లి కొండలను చేరి తరుము వారు తిరిగి వచ్చువరకు మూడుదినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెద కిరిగాని వారు కనబడలేదు.

యెహోషువ 2 TELUBSI

యెహోషువ 2:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వారు వెళ్లి కొండలు ఎక్కి తమను తరిమేవారు తిరిగి వచ్చేవరకూ మూడు రోజులు అక్కడే ఉండిపోయారు. తరిమేవారు ఆ మార్గమంతా వారిని వెదికారు గానీ వారు కనబడలేదు.

యెహోషువ 2 IRVTEL

యెహోషువ 2:22 TERV (పవిత్ర బైబిల్)

ఆ మనుష్యులు ఆమె ఇల్లు విడిచి, కొండల్లోకి వెళ్లిపోయారు. మూడు రోజులు వాళ్లు అక్కడే ఉన్నారు. రాజు మనుష్యులు మార్గం అంతా వెదికారు. మూడు రోజుల తర్వాత రాజు మనుష్యులు వెదకటం మానివేసి పట్టణానికి తిరిగి వెళ్లిపోయారు.

యెహోషువ 2 TERV

యెహోషువ 2:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారు అక్కడినుండి కొండల్లోకి వెళ్లి, తమను తరిమినవారు దారి పొడవునా తమను వెదికి వారిని పట్టుకోలేక తిరిగి వెళ్లిపోయేవరకు మూడు రోజులు అక్కడ ఉన్నారు.

యెహోషువ 2 TSA