Skip to content

యెహోషువ 2:2-3 - అన్ని సంస్కరణలను పోల్చండి

యెహోషువ 2:2-3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలీయులయొద్దనుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు–నీయొద్దకు వచ్చి నీ యింట చేరిన ఆ మనుష్యులను వెలుపలికి తీసికొనిరమ్ము; వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుష్యులను పంపగా

యెహోషువ 2 TELUBSI

యెహోషువ 2:2-3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

దేశాన్ని వేగుచూడటానికి ఇశ్రాయేలీయుల దగ్గర నుండి ఎవరో రాత్రివేళ ఇక్కడికి వచ్చారని యెరికో రాజుకు సమాచారం వచ్చింది. అతడు తన మనుషులను పంపి “నీ దగ్గరికి వచ్చి నీ ఇంట్లో ప్రవేశించిన ఆ మనుషులను బయటికి తీసుకురా, వారు ఈ దేశాన్ని వేగు చూడటానికి వచ్చారు” అని రాహాబుకు కబురు పంపాడు.

యెహోషువ 2 IRVTEL

యెహోషువ 2:2-3 TERV (పవిత్ర బైబిల్)

“మన ప్రజల బలహీనత తెలుసుకొనేందుకు కొందరు ఇశ్రాయేలు మనుష్యులు వచ్చారు” అని యెరికో రాజుతో ఎవరో చెప్పారు. కనుక యెరికో రాజు రాహాబుకు ఇలా కబురంపాడు: “నీ ఇంటికి వచ్చిదాక్కొన్న ఆ మనుష్యుల్ని దాచిపెట్టకు. వాళ్లను బయటకు తీసుకొనిరా. వాళ్లు మన దేశాన్ని వేగు చూడటానికి వచ్చారు.”

యెహోషువ 2 TERV

యెహోషువ 2:2-3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఎవరో యెరికో రాజుతో, “చూడండి, కొంతమంది ఇశ్రాయేలీయులు రాత్రి ఈ దేశాన్ని వేగుచూడటానికి వచ్చారు” అని చెప్పారు. కాబట్టి యెరికో రాజు: “నీ దగ్గరకు వచ్చి నీ ఇంట్లో ఉన్న మనుష్యులను ఇక్కడకు తీసుకురా, ఎందుకంటే వారు ఈ దేశాన్ని వేగుచూడటానికి వచ్చారు” అని ఆజ్ఞ జారీచేస్తూ రాహాబుకు సందేశం పంపాడు.

యెహోషువ 2 TSA