Skip to content
బైబిల్ యాప్ లోగో

యెహోషువ 2:13 - అన్ని సంస్కరణలను పోల్చండి

యెహోషువ 2:13 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములును నా అక్కచెల్లెండ్రును వారికి కలిగి యున్నవారందరును చావకుండ బ్రదుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవాతోడని ప్రమాణము చేయుడనెను.

షేర్ చేయి
యెహోషువ 2 TELUBSI

యెహోషువ 2:13 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నా తల్లిదండ్రుల, అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ళ కుటుంబాలన్నిటినీ చావు నుండి రక్షిస్తామని నాకు కచ్చితమైన ఒక ఆనవాలు ఇవ్వండి” అంది.

షేర్ చేయి
యెహోషువ 2 IRVTEL

యెహోషువ 2:13 TERV (పవిత్ర బైబిల్)

నా తండ్రి, తల్లి, సోదరులు, సోదరీలు, వాళ్లందరి కుటుంబాల్ని, నా కుటుంబాన్ని మీరు బ్రతుకనిస్తామని నాకు మాట ఇవ్వండి. చావునుండి మీరు మమ్మల్ని రక్షిస్తామని ప్రమాణం చేయండి.”

షేర్ చేయి
యెహోషువ 2 TERV

యెహోషువ 2:12-13 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“ఇప్పుడు, దయచేసి మీరు నా కుటుంబం మీద దయ చూపిస్తారని యెహోవా మీద ప్రమాణం చేయండి. ఎందుకంటే నేను మీ పట్ల దయ చూపించాను కాబట్టి మీరు నా తల్లిదండ్రుల, నా అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ల, అలాగే వారికి సంబంధించిన వారినందరిని ప్రాణాలతో కాపాడతారని నాకొక నిజమైన సూచన ఇవ్వండి” అని అడిగింది.

షేర్ చేయి
యెహోషువ 2 TSA