Skip to content

యెహోషువ 18:9 - అన్ని సంస్కరణలను పోల్చండి

యెహోషువ 18:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆ మనుష్యులు వెళ్లి దేశసంచారము చేయుచు ఏడువంతులుగా, గ్రామములచొప్పున, దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోహులోని పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చిరి.

యెహోషువ 18 TELUBSI

యెహోషువ 18:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వారు వెళ్లి దేశమంతా తిరిగి ఏడు భాగాలుగా, పట్టణాల ప్రకారం వివరాలను పుస్తకంలో రాసి షిలోహు శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చారు.

యెహోషువ 18 IRVTEL

యెహోషువ 18:9 TERV (పవిత్ర బైబిల్)

కనుక ఆ మనుష్యులు ఆ చోటు విడిచి ఆ దేశంలో ప్రవేశించారు. ఆ మనుష్యులు ఆ దేశాన్ని పరిశీలించి, యెహోషువ కొరకు పటాలు తయారుచేసారు. ప్రతి పట్టణాన్నీ వారు పరిశీలించి, దేశం ఏడు భాగాలు అయ్యేటట్టు చేసారు. వారు ఆ పటాలు తయారుచేసి యెహోషువ దగ్గరకు తిరిగి వచ్చారు. యెహోషువ ఇంకా షిలోహులోని పాళెములోనే ఉన్నాడు.

యెహోషువ 18 TERV

యెహోషువ 18:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆ మనుష్యులు అక్కడినుండి బయలుదేరి దేశమంతా తిరిగి ఏడు భాగాలుగా పట్టణాలవారీగా దాని వివరాలను ఒక గ్రంథపుచుట్ట మీద వ్రాసి, షిలోహులోని శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరకు తిరిగి వచ్చారు.

యెహోషువ 18 TSA