యోవేలు 3:9-11
యోవేలు 3:9-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దేశాల మధ్య ఈ విషయం చాటించండి, యుద్ధానికి సిద్ధపడండి! వీరులను పురికొల్పండి, పోరాడేవారందరు సమకూడి వచ్చి దాడి చేయాలి. మీ నాగటి నక్కులను సాగగొట్టి ఖడ్గాలు చేయండి, మడ్డికత్తులను సాగగొట్టి ఈటెలుగా చేయండి. “నేను బలవంతున్ని!” అని బలహీనులు అనుకోవాలి. ప్రతి వైపు ఉన్న అన్ని దేశాల్లారా, త్వరగా రండి, అక్కడ సమకూడండి.
యోవేలు 3:9-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
రాజ్యాల్లో ఈ విషయం చాటించండి, యుద్ధానికి సిద్ధపడండి. శూరులను రేపండి. వారిని దగ్గరికి రమ్మనండి. సైనికులంతా రావాలి. మీ నాగటి కర్రులను సాగగొట్టి కత్తులు చేయండి. మీ మడ్డికత్తులు సాగగొట్టి ఈటెలు చేయండి. “నాకు బలముంది” అని బలం లేనివాడు అనుకోవాలి. చుట్టుపట్లనున్న రాజ్యాల్లారా, మీరంతా త్వరగా సమకూడిరండి. యెహోవా, నీ గొప్ప శూరులను ఇక్కడికి తీసుకు రా.
యోవేలు 3:9-11 పవిత్ర బైబిల్ (TERV)
రాజ్యాలలో దీనిని ప్రకటించండి: యుద్ధానికి సిద్ధపడండి! బలాఢ్యులను మేల్కొలపండి! యుద్ధ వీరులందరినీ దగ్గరగా రానివ్వండి, వారిని రానివ్వండి! మీ నాగటి కర్రులను చెడగొట్టి కత్తులు చేయండి. మీ పోటు కత్తులు చెడగొట్టి ఈటెలు చేయండి. బలహీనుడ్ని కూడ “నేను బలాఢ్యుడను” అని చెప్పనీయండి. సకల రాజ్యాల్లారా, త్వరపడండి! ఆ స్థలానికి కూడి రండి! యెహోవా, బలమైన నీ సైనికులను తీసికొని రా.
యోవేలు 3:9-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అన్యజనులకు ఈ సమాచారము ప్రకటనచేయుడి–యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరు సిద్ధపడి రావలెను. మీ కఱ్ఱులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి; బలహీనుడు–నేను బలాఢ్యుడను అనుకొనవలెను. చుట్టుపెట్లనున్న అన్యజనులారా, త్వరపడి రండి; సమకూడి రండి. యెహోవా, నీ పరాక్రమశాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము.