యోబు 38:39-41
యోబు 38:39-41 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“సింహపుపిల్లలు గుహలో పడుకుని ఉన్నప్పుడు, అవి పొదలో పొంచి ఉన్నప్పుడు, ఆడసింహం కోసం నీవు ఎరను వేటాడి వాటి ఆకలిని తీర్చగలవా? కాకిపిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆహారం లేక తిరుగుతున్నప్పుడు కాకికి ఆహారం ఇచ్చేది ఎవరు?
యోబు 38:39-41 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆడసింహం కోసం నువ్వు జంతువును వేటాడతావా? సింహం పిల్లలు తమ గుహల్లో పడుకుని ఉన్నప్పుడు, తమ మాటుల్లో పొంచి ఉన్నప్పుడు నువ్వు వాటి ఆకలి తీరుస్తావా? కాకి పిల్లలు దేవునికి మొరపెట్టేటప్పుడు, ఆకలికి అలమటించేటప్పుడు వాటికి ఆహారం ఇచ్చేవాడెవడు?
యోబు 38:39-41 పవిత్ర బైబిల్ (TERV)
“యోబూ, ఆడ సింహమునకు ఆహారం నీవు కనుగొంటావా? ఆకలితో ఉన్న సింహపు పిల్లలకు నీవు ఆహారం పెడతావా? అవి దాగుకొనే చోట్ల వాటి గుహలలో పండుకొని లేక కూర్చొని ఉంటాయి. యోబూ, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆహారం లేక అటు ఇటు తిరుగునప్పుడు కాకులను పోషించేది ఎవరు?
యోబు 38:39-41 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా? సింహపుపిల్లలు తమతమ గుహలలో పండుకొనునప్పుడు తమ గుహలలో పొంచి యుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా? తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?