యోబు 38:28-33
యోబు 38:28-33 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను ఎవరు పుట్టిస్తారు? ఎవరి గర్భం నుండి మంచుగడ్డ వచ్చింది? పైనుండి దిగివచ్చే మంచును ఎవరు పుట్టించారు? నీళ్లు రాయిలా ఎప్పుడు గడ్డకట్టుకుపోతాయి, లోతైన నీళ్ల ఉపరితలం ఎప్పుడు గట్టిపడుతుంది? “కృత్తిక నక్షత్రాలను నీవు సంకెళ్ళతో బంధించగలవా? మృగశీర్ష నక్షత్రం యొక్క కట్లు విప్పగలవా? నక్షత్ర రాశులను వాటి వాటి కాలాల్లో వచ్చేలా నీవు చేయగలవా? సప్తరుషి నక్షత్రాలను వాటి ఉప నక్షత్రాలను నీవు నడిపించగలవా? ఆకాశం యొక్క చట్టాలు నీకు తెలుసా? నీవు భూమిపై దేవుని ఆధిపత్యాన్ని ఏర్పాటు చేయగలవా?
యోబు 38:28-33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను కన్నది ఎవరు? మంచు గడ్డ ఎవరి గర్భంలోనుండి వస్తుంది? ఆకాశం నుండి జాలువారే మంచును ఎవరు పుట్టించారు? జలాలు దాక్కుని రాయిలాగా గడ్డకట్టుకుపోతాయి. అగాధజలాల ఉపరితలం ఘనీభవిస్తుంది. కృత్తిక నక్షత్రాలను నువ్వు బంధించగలవా? మృగశిరకు కట్లు విప్పగలవా? వాటి కాలాల్లో నక్షత్ర రాసులను వచ్చేలా చేయగలవా? సప్తర్షి నక్షత్రాలను వాటి ఉపనక్షత్రాలను నువ్వు నడిపించగలవా? ఆకాశమండల నియమాలు నీకు తెలుసా? అది భూమిని పరిపాలించే విధానం నువ్వు స్థాపించగలవా?
యోబు 38:28-33 పవిత్ర బైబిల్ (TERV)
యోబూ, వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందువులు ఎక్కడ నుండి వస్తాయి? యోబూ, హిమమునకు తల్లి ఎవరు? ఆకాశంనుండి కురిసే మంచుకు జన్మ ఇచ్చేది ఎవరు? జలాలు బండలా గట్టిగాను మహా సముద్రాల పైభాగాలు గట్టిగాను ఎప్పుడు బిగిసిపోతాయి? “యోబూ, కృత్తిక నక్షత్రాలను నీవు బిగించగలవా? మృగశీర్షిక కట్లు నీవు విప్పగలవా? యోబూ, నక్షత్రరాసులు సరియైన కాలములలో సమకూడునట్లు నీవు చేయగలవా? లేక ఎలుగుబంటిని దాని పిల్లలతో నీవు నడిపించగలవా? యోబూ, ఆకాశాన్ని పాలించే నియమాలు నీకు తెలియునా? భూమి మీద వాటి పాలనను నీవు ప్రారంభించగలవా?
యోబు 38:28-33 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చు నట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా?