యోబు 14:7-9
యోబు 14:7-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“కనీసం చెట్టుకైనా నిరీక్షణ ఉంది: దాన్ని నరికివేసినా అది మరలా చిగురిస్తుంది, దానికి లేత కొమ్మలు ఖచ్చితంగా వస్తాయి. దాని వేర్లు భూమిలో ఎండిపోయినా దాని మోడు మట్టిలో చనిపోయినా, నీటి వాసన తగిలితే చాలు అది చిగురిస్తుంది. లేత మొక్కలా కొమ్మలు వేస్తుంది.
యోబు 14:7-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
చెట్టును నరికి వేస్తే అది తిరిగి చిగురు వేస్తుందనీ, లేత కొమ్మలు తిరిగి మొలకెత్తుతాయనీ ఆశాభావం ఉంటుంది. నరికేసిన చెట్టు వేరు భూమిలో కుళ్లిపోయి, దాని మొదలు మట్టిలో చీకిపోతూ ఉంటుంది. అయితే దానికి నీటి వాసన తగిలినప్పుడు అది చిగురు వేస్తుంది, లేత మొక్కలాగా కొత్తగా కొమ్మలు కాస్తుంది.
యోబు 14:7-9 పవిత్ర బైబిల్ (TERV)
“అయితే ఒక చెట్టుకు నీరీక్షణ ఉంది. దాన్ని నరికివేస్తే, అది మరల పెరుగుతుంది. అది కొత్త కొమ్మలు వేస్తూనే ఉంటుంది. భూమిలో దాని వేర్లు పాతవైపోవచ్చును. దాని మొద్దు మట్టిలో చీకిపోవచ్చును. కానీ నీళ్లు ఉంటే అది కొత్త చిగుళ్లు వేస్తుంది. మొక్కల్లా అది కొమ్మలు వేస్తుంది.
యోబు 14:7-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వృక్షము నరకబడినయెడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేతకొమ్మలు వేయుననియు నమ్మకముకలదు. దాని వేరు భూమిలో పాతదై పోయినను దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసనమాత్రముచేత అది చిగుర్చును లేత మొక్కవలె అది కొమ్మలు వేయును.