యోబు 13:5-12

యోబు 13:5-12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

మీరందరు మౌనంగా ఉంటే మంచిది, మీకు అదే జ్ఞానము. ఇప్పుడు నా వాదన వినండి; నా వాదనలు ఆలకించండి. దేవుని పక్షంగా మీరు దుర్మార్గంగా మాట్లాడగలరా? ఆయన కోసం వంచనగా మాట్లాడగలరా? ఆయన పట్ల పక్షపాతం చూపిస్తారా? దేవుని పక్షంగా మీరు వాదిస్తారా? ఒకవేళ దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తే బాగుంటుందా? ఒక మనిషిని మోసం చేసినట్టు మీరు ఆయనను మోసం చేయగలరా? మీరు రహస్యంగా పక్షపాతం చూపిస్తే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని గద్దిస్తారు. దేవుని వైభవం మిమ్మల్ని భయపెట్టదా? ఆయన భయం మీ మీదికి రాదా? మీ నీతిమాటలు బూడిదలాంటి సామెతలు, మీ వాదనలు మట్టి వాదనలు.

షేర్ చేయి
చదువండి యోబు 13

యోబు 13:5-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మీరేమీ మాట్లాడకుండా ఉంటేనే మంచిది. అదే మీకు ఉత్తమం. దయచేసి నేను చెప్పేది వినండి. నా పక్షంగా నేను చేసుకుంటున్న వాదన ఆలకించండి. మీరు దేవుని పక్షంగా నిలబడి అన్యాయంగా వాదించ వచ్చా? ఆయన తరపున వంచన మాటలు పలక వచ్చా? ఆయన పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శిస్తారా? మీరు దేవుని పక్షాన నిలబడి వాదిస్తారా? ఒకవేళ ఆయన మిమ్మల్ని పరిశోధిస్తే అది మీకు క్షేమకరమా? ఒకడు ఇతరులను మోసం చేసినట్టు మీరు ఆయనను మోసం చేస్తారా? మీరు రహస్యంగా పక్షపాతం చూపిస్తే ఆయన తప్పకుండా మిమ్మల్ని గద్దిస్తాడు. ఆయన ప్రభావం మీకు భయం కలిగించదా? ఆయన భయం మిమ్మల్ని ఆవరించదా? మీరు చెప్పే గద్దింపు మాటలు బూడిదలాంటి సామెతలు. మీరు చేస్తున్న వాదాలు మట్టిగోడలవంటివి.

షేర్ చేయి
చదువండి యోబు 13

యోబు 13:5-12 పవిత్ర బైబిల్ (TERV)

మీరు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటే బాగుండేది. అది మీరు చేయగలిగిన అతి జ్ఞానంగల పని. “ఇప్పుడు, నా వాదం వినండి. నేను నా విన్నపం చెబుతుండగా, వినండి మీరు దేవుని కోసం అబద్ధాలు చెబుతున్నారా? మీరు చెప్పాలని దేవుడు కోరుతున్నవి అబద్ధాలే అని మీరు నిజంగా నమ్ముచున్నారా? మీరు నాకు విరోధంగా దేవుని ఆదుకొనేందుకు ప్రయత్నిస్తున్నారా? న్యాయస్థానంలో మీరు దేవుని ఆదుకొంటారా? దేవుడు మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలిస్తే ఆయనకు మంచి ఏమైనా కనబడుతుందా? మీరు మనుష్యులను మోసం చేసినట్టే దేవునిని కూడా మోసం చేయగలమని నిజంగా అనుకొంటున్నారా? మీరు కనుక న్యాయస్థానంలో ఒకరి పక్షం వహించాలని రహస్యంగా నిర్ణయిస్తే దేవుడు విజంగా మిమ్మల్ని గద్దిస్తాడు. దేవుని ప్రభావం మిమ్మల్ని భయపెట్టేస్తుంది. ఆయన్ని చూచి మీరు భయపడతారు. (మీరు తెలివిగానూ, జ్ఞానంగానూ మాట్లాడుతున్నాం అనుకొంటారు). కానీ మీ మాటలు బూడిదలా పనికిమాలినవే. మీ వాదాలు మట్టిలా బలహీనమైనవే.

షేర్ చేయి
చదువండి యోబు 13

యోబు 13:5-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును. దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యెము నాలకించుడి. దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదనచేయుదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా? ఆయనయెడల మీరు పక్షపాతము చూపుదురా? దేవుని పక్షమున మీరు వాదింతురా? ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసముచేయునట్లు మీరు ఆయనను మోసముచేయుదురా? మీరు రహస్యముగా పక్షపాతము చూపినయెడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును. ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా? ఆయన భయము మీ మీదికి రాదా? మీ హెచ్చరిక మాటలు బూడిదె సామెతలు. మీ వాదములు మంటివాదములు

షేర్ చేయి
చదువండి యోబు 13