యోహాను 20:27-28 - Compare All Versions
యోహాను 20:27-28 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తరువాత తోమాను చూచి–నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. అందుకు తోమా ఆయనతో–నా ప్రభువా, నా దేవా అనెను.
షేర్ చేయి
యోహాను 20 TELUBSIయోహాను 20:27-28 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తరువాత ఆయన తోమాను చూసి, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. అలాగే నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసివి కావద్దు” అన్నాడు. దానికి జవాబుగా తోమా, “నా ప్రభూ, నా దేవా” అన్నాడు.
షేర్ చేయి
యోహాను 20 IRVTELయోహాను 20:27-28 TERV (పవిత్ర బైబిల్)
యేసు తోమాతో, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. నా ప్రక్క భాగంపై నీ చేతుల్ని ఉంచు! ఇక అనుమానించకు” అని అన్నాడు. తోమా ఆయనతో, “దేవా! నా ప్రభూ!” అని అన్నాడు.
షేర్ చేయి
యోహాను 20 TERVయోహాను 20:27-28 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తర్వాత ఆయన తోమాతో, “నా చేతులను చూడు; నీ వ్రేలితో ఆ గాయాలను ముట్టి చూడు. నీ చేయి చాపి నా ప్రక్క గాయాన్ని ముట్టి చూడు. అనుమానించడం మాని నమ్ము” అన్నారు. తోమా ఆయనతో, “నా ప్రభువా, నా దేవా!” అన్నాడు.
షేర్ చేయి
యోహాను 20 TSA