యిర్మీయా 38:9-10 - Compare All Versions

యిర్మీయా 38:9-10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

రాజా, నా యేలినవాడా, ఆ గోతిలో వేయబడిన యిర్మీయా అను ప్రవక్తయెడల ఈ మనుష్యులు చేసినది యావత్తును అన్యాయము; అతడున్న చోటను అతడు ఆకలిచేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టె లేమియు లేవు. అందుకు రాజు–నీవు ఇక్కడనుండి ముప్పదిమంది మనుష్యులను వెంటబెట్టుకొనిపోయి, ప్రవక్తయైన యిర్మీయా చావకమునుపు ఆ గోతిలోనుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవియ్యగా

షేర్ చేయి
యిర్మీయా 38 TELUBSI

యిర్మీయా 38:9-10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“రాజా, నా ప్రభూ, ఆ గోతిలో వేసిన యిర్మీయా అనే ప్రవక్త పట్ల ఈ మనుషులు చేసిందంతా దుర్మార్గమే. అతడు ఆకలితో చావాలని అతన్ని గోతిలో పడేశారు. ఎందుకంటే పట్టణంలో ఆహారం ఇంక లేదు.” అప్పుడు రాజు కూషీయుడైన ఎబెద్మెలెకుకు ఆజ్ఞ ఇచ్చి “నువ్వు ఇక్కడనుంచి 30 మంది మనుషులను వెంటబెట్టుకుని వెళ్లి, ప్రవక్త అయిన యిర్మీయా చావకముందు ఆ గోతిలోనుంచి అతన్ని తీయించు,” అన్నాడు.

షేర్ చేయి
యిర్మీయా 38 IRVTEL

యిర్మీయా 38:8-10 TERV (పవిత్ర బైబిల్)

ఎబెద్మెలెకు ఇలా అన్నాడు: “నా ఏలినవాడవగు ఓ రాజా, ఆ అధికారులు చాలా క్రూరంగా ప్రవర్తించారు. ప్రవక్తయైన యిర్మీయా పట్ల వారు బహు క్రూరంగా వ్యవహరించారు. వారతనిని నీళ్లు నిలువజేసే గోతిలో పడవేశారు. అతనక్కడ చని పోయేలా వదిలి వేశారు.” అప్పుడు రాజైన సిద్కియా ఇతియోపియ వాడగు ఎబెద్మెలెకుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది ఇలా ఉంది: “ఎబెద్మెలెకూ, రాజభవనం నుంచి నీతో ముగ్గురు మనుష్యులను తీసికొని వెళ్లు. యిర్మీయా చనిపోకముందే వారి సహాయంతో అతనిని గోతిలోనుండి పైకి తియ్యి.”

షేర్ చేయి
యిర్మీయా 38 TERV

యిర్మీయా 38:9-10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“రాజా! నా ప్రభువా! ఈ మనుష్యులు యిర్మీయా ప్రవక్త విషయంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. వీరు అతన్ని గోతిలో వేశారు, పట్టణంలో ఇక ఆహారం లేకుండా పోతే అక్కడ అతడు ఆకలితో చనిపోతాడు” అని మనవి చేశాడు. అప్పుడు రాజు కూషీయుడైన ఎబెద్-మెలెకుకు, “నీవు ఇక్కడినుండి ముప్పది మందిని తీసుకెళ్లి, యిర్మీయా ప్రవక్తను చావకముందే ఆ గోతిలో నుండి బయటకు తీయించు” అని ఆజ్ఞాపించాడు.

షేర్ చేయి
యిర్మీయా 38 TSA