న్యాయాధిపతులు 21:17-18
న్యాయాధిపతులు 21:17-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రం తుడిచిపెట్టుకుపోకుండ బెన్యామీను గోత్రంలో మిగిలిన వారికి వారసులుండాలి. వారికి మన కుమార్తెలను భార్యలుగా ఇవ్వలేం, ఎందుకంటే ఇశ్రాయేలీయులమైన మనం, ‘ఎవరైనా బెన్యామీనీయునికి తమ కుమార్తెను భార్యగా ఇస్తే వారు శాపగ్రస్తులు’ అని ప్రమాణం చేశాము.
న్యాయాధిపతులు 21:17-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“ఇశ్రాయేలీయుల్లోనుండి ఒక గోత్రం అంతరించి పోకుండా బెన్యామీనీయుల్లో తప్పించుకున్న వారికి వారసులు ఉండాలి” అన్నారు. “ఇశ్రాయేలీయుల్లో ఎవరైనా సరే, తన కూతుర్ని బెన్యామీనీయుడికి ఇస్తే వాణ్ణి నాశనం చేయాలని శపథం చేశాం. కాబట్టి మన కూతుళ్ళను వారికిచ్చి పెళ్ళి చేయకూడదు,” అని చెప్పుకున్నారు.
న్యాయాధిపతులు 21:17-18 పవిత్ర బైబిల్ (TERV)
ఇంకా సజీవులై ఉన్న బెన్యామీను పురుషులకు వారి వంశాలు కొనసాగేందుకుగాను పిల్లలు ఉండాలి. ఇశ్రాయేలుకి చెందిన ఒక వంశం మరణించకుండా ఉండడానికి ఇది చేయబడాలి. కాని మేము మా కుమార్తెలు బెన్యామీను పురుషుల్ని వివాహము చేసుకోనియ్యము. మేము ఈ ప్రతిజ్ఞ చేశాము, ‘ఎవరైనా సరే బెన్యామీను పురుషునికి భార్యనిస్తే, అతనికి చెరుపు కలుగుతుంది.’
న్యాయాధిపతులు 21:17-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇశ్రాయేలీయులలోనుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండునట్లు బెన్యామీనీయులలో తప్పించుకొనిన వారికి స్వాస్థ్య ముండవలెననిరి. ఇశ్రాయేలీయులలో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇచ్చినయెడల వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసియున్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడ దని చెప్పుకొనుచుండిరి.