యెషయా 66:9-14

యెషయా 66:9-14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నేను ప్రసవవేదన కలిగించి జన్మనివ్వకుండా ఉంటానా?” అని యెహోవా అడుగుతున్నారు. “పుట్టుక వరకు తీసుకువచ్చి గర్భాన్ని మూస్తానా?” అని నీ దేవుడు అడుగుతున్నారు. “యెరూషలేమును ప్రేమించే మీరందరూ ఆమెతో సంతోషించి ఆనందించండి. ఆమె గురించి ఏడ్చే మీరందరూ ఆమెతో గొప్పగా సంతోషించండి. ఆదరణకరమైన ఆమె రొమ్ము పాలు త్రాగి మీరు తృప్తిపొందుతారు. మీరు తృప్తిగా త్రాగి ఆమె సమృద్ధిని అనుభవిస్తూ ఆనందిస్తారు.” యెహోవా చెప్పే మాట ఇదే: “వినండి. ఆమె దగ్గరకు సమాధానం నదిలా ప్రవహించేలా చేస్తాను, దేశాల సంపదలు పొంగిపొర్లే ప్రవాహంలా వస్తాయి; మీరు పోషించబడి ఆమె చంకనెక్కుతారు ఆమె మోకాళ్లమీద ఆడుకుంటారు. తల్లి తన బిడ్డను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు.” మీరు ఇది చూసినప్పుడు మీ హృదయం సంతోషిస్తుంది మీరు గడ్డిలా వర్ధిల్లుతారు; యెహోవా యొక్క చేతి బలం తన సేవకులకు తెలియజేయబడుతుంది, కాని ఆయన కోపం తన శత్రువులకు చూపించబడుతుంది.

యెషయా 66:9-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నేను ప్రసవవేదన కలగజేసి కనకుండా చేస్తానా?” అని యెహోవా అడుగుతున్నాడు. “పుట్టించేవాడినైన నేను గర్భాన్ని మూస్తానా?” అని నీ దేవుడు అడుగుతున్నాడు. యెరూషలేమును ప్రేమించే మీరంతా ఆమెతో సంతోషించండి. ఆనందించండి. ఆమెను బట్టి దుఃఖించే మీరంతా ఆమెతో సంతోషించండి. ఆదరణకరమైన ఆమె చనుపాలు మీరు కుడిచి తృప్తి పడతారు. ఆమె సమృద్ధిని అనుభవిస్తూ ఆనందిస్తారు. యెహోవా ఇలా చెబుతున్నాడు, “నదిలాగా శాంతిసమాధానాలు ఆమె దగ్గరికి ప్రవహించేలా చేస్తాను. రాజ్యాల ఐశ్వర్యం ఒడ్డు మీద పొర్లిపారే ప్రవాహంలాగా చేస్తాను. మిమ్మల్ని చంకలో ఎత్తుకుంటారు. మోకాళ్ల మీద ఆడిస్తారు. తల్లి తన బిడ్డను ఓదార్చినట్టు నేను మిమ్మల్ని ఓదారుస్తాను. యెరూషలేములోనే మిమ్మల్ని ఓదారుస్తాను.” మీరు దీన్ని చూస్తారు. మీ హృదయం సంతోషిస్తుంది. మీ ఎముకలు లేతగడ్డిలాగా బలుస్తాయి. యెహోవా హస్తబలం ఆయన సేవకులకు వెల్లడి అవుతుంది. అయితే ఆయన తన శత్రువుల మీద కోపం చూపుతాడు.

యెషయా 66:9-14 పవిత్ర బైబిల్ (TERV)

అదే విధంగా ఏదో క్రొత్తది జన్మించాల్సిన అవసరం లేకుండా నేను బాధ కలిగించను.” యెహోవా ఇది చెబుతున్నాడు: “నేను నీకు పురిటినొప్పులు రానిచ్చినట్లయితే, అప్పుడు నీ క్రొత్త దేశం నీకు రాకుండా నేను ఆపుజేయను.” మీ దేవుడే ఇది చెప్పాడు. యెరూషలేమా, సంతోషించు! యెరూషలేమును ప్రేమించే మీరందరూ సంతోషించండి. విచారకరమైన విషయాలు యెరూషలేముకు సంభవించాయి. కనుక మీరు కొంతమంది మనుష్యులు విచారించారు. కానీ, అలాంటి మీరు ఇప్పుడు ఎంతో ఎంతో సంతోషించాలి. ఎందుకంటే ఆమె స్థనాలనుండి పాలు వచ్చినట్లుగా మీకు కరుణ లభిస్తుంది. ఆ “పాలు” నిజంగా మిమ్మల్ని తృప్తిపరుస్తాయి. ప్రజలారా, మీరు పాలు త్రాగుతారు. మరియు మీరు యెరూషలేము మహిమను నిజంగా అనుభవిస్తారు. యెహోవా చెబుతున్నాడు: “చూడండి, నేను మీకు శాంతినిస్తాను. ఒక మహానది ప్రవాహంలా ఈ శాంతి మీ దగ్గరకు ప్రవహించి వస్తుంది. భూమి మీద రాజ్యాలన్నింటిలోని ఐశ్వర్యాలు అన్నీ మీ వద్దకు ప్రవహిస్తూ వస్తాయి. ఒక వరద ప్రవాహంలా ఈ ఐశ్వర్యాలు ప్రవహిస్తాయి. మీరు చిన్న పిల్లల్లా ఉంటారు. మీరు ‘పాలు’ త్రాగుతారు. మీరు ఎత్తబడి నా కౌగిటిలో ఉంటారు. మీరు నా మోకాళ్లమీద ఊపబడతారు. యెరూషలేములో మీరు ఓదార్చబడతారు. ఒక తల్లి తన బిడ్డను ఓదార్చేలా నేను మిమ్మల్ని ఓదార్చుతాను.” మీరు నిజంగా అనుభవించేవాటిని మీరు చూస్తారు. మీరు స్వతంత్రులై, గడ్డి పెరుగునట్లు పెరుగుతారు. యెహోవా సేవకులు ఆయన శక్తిని చూస్తారు. కానీ యెహోవా శత్రువులు ఆయన కోపాన్ని చూస్తారు.

యెషయా 66:9-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నేను ప్రసవవేదన కలుగజేసి కనిపింపక మానెదనా? అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా? అని నీ దేవుడడుగుచున్నాడు. యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరు ఆమెతో సంతోషించుడి ఆనందించుడి. ఆమెనుబట్టి దుఃఖించువారలారా, మీరందరు ఆమెతో ఉత్సహించుడి ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించె దరు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమెయొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె మీయొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్లమీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆద రించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ యెముకలు లేతగడ్డివలె బలియును యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కను పరచబడును ఆయన తన శత్రువులయెడల కోపము చూపును.