యెషయా 53:1-2
యెషయా 53:1-2 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు.
యెషయా 53:1-2 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మా సందేశాన్ని ఎవరు నమ్మారు? యెహోవా హస్తం ఎవరికి వెల్లడయింది? లేత మొక్కలా ఎండిన భూమిలో మొలిచిన మొక్కలా అతడు ఆయన ఎదుట పెరిగాడు. మనల్ని అతనివైపు ఆకర్షించేంత అందం గాని ఘనత గాని అతనికి లేదు, మనం అతన్ని కోరుకునేంతగా మంచి రూపమేమీ అతనికి లేదు.
యెషయా 53:1-2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మేము విన్న విషయాలు ఎవరు నమ్ముతారు? యెహోవా బాహువు ఎవరికి వెల్లడి అయింది? ఆయన యెహోవా ఎదుట లేత మొక్కలాగా ఎండిపోయిన భూమిలో మొలిచిన మొక్కలాగా పెరిగాడు. అతనికి ఎలాంటి మంచి రూపంగానీ గొప్పదనంగానీ లేదు. మనలను ఆకర్షించే అందమేమీ ఆయనలో కనబడలేదు.
యెషయా 53:1-2 పవిత్ర బైబిల్ (TERV)
మేము ప్రకటించిన సంగతులను నిజంగా ఎవరు నమ్మారు? యెహోవా హస్తం ఎవరికి బయలు పరచబడింది? యెహోవా ఎదుట ఆయన ఒక చిన్న మొక్కవలె ఉన్నాడు. ఎండిన భూమిలో ఎదుగుతున్న మొక్కవలె పెరిగాడు. మనము ఆయనలో చూడతగిన రూపముగాని తేజస్సుగాని, ఏమి లేదు. మనం ఆయనని చూడటానికి ఇష్టపడుటకు ఆయనలో ప్రత్యేకత ఏమీ మనకు కనబడదు.