యెషయా 50:10-11
యెషయా 50:10-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినే వారెవరు? వెలుగు లేకుండా ఉంటూ చీకటిలో నడిచేవాడు యెహోవా నామాన్ని నమ్మి తన దేవునిపై ఆధారపడాలి. అయితే ఇప్పుడు అగ్నిని ముట్టించి మీ చుట్టూ మండుతున్న దివిటీలను పెట్టుకునే మీరందరు, వెళ్లండి, మీ మంటల వెలుగులో నడవండి మీరు వెలిగించిన దివిటీల మంటల్లో నడవండి. నా చేతి నుండి మీరు పొందుకునేది ఇదే: మీరు వేదనలో పడుకుంటారు.
యెషయా 50:10-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినే వాడెవడు? వెలుగు లేకుండా చీకటిలో నడిచేవాడు యెహోవా నామాన్ని ఆశ్రయించి ఆయన్ని నమ్ముకోవాలి. ఇదిగో, నిప్పులు వెలిగించి మీ చుట్టూ మంటలను పెట్టుకొనే వారంతా మీ అగ్ని వెలుగులో, మీరు వెలిగించిన మంటల్లో నడవండి. ఇది మీకు నా చేతినుండే కలుగుతున్నది. మీరు వేదనతో పండుకుంటారు.
యెషయా 50:10-11 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవాను గౌరవించే ప్రజలు ఆయన సేవకుని మాటకూడా వింటారు. ఆ సేవకుడు ఏం జరుగుతుందో తెలియకుండానే సంపూర్ణంగా దేవుణ్ణి నమ్ముకొని జీవిస్తాడు. అతడు వాస్తవంగా యెహోవా నామాన్నే నమ్ముకొంటాడు, మరియు ఆ సేవకుడు తన దేవుని మీద ఆధారపడతాడు. “ప్రజలారా, చూడండి, మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా జీవించాలనుకొంటున్నారు. మీ మంటలను, జ్వాలలను మీరే అంటిస్తున్నారు. అలానే, మీ దారిన మీరు జీవిస్తున్నారు. కానీ మీరు శిక్షించబడతారు. మీరు మీ మంటల్లో, జ్వాలల్లో పడతారు, మీరు కాల్చివేయబడుతారు. అలా జరిగేట్టు నేను చేస్తాను.
యెషయా 50:10-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకునిమాట వినువాడెవడు? వెలుగులేకయే చీకటిలో నడచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్నికొరవులను మీచుట్టు పెట్టుకొనువారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి నా చేతివలన ఇది మీకు కలుగుచున్నది మీరు వేదనగలవారై పండుకొనెదరు.