యెషయా 42:17-25

యెషయా 42:17-25 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అయితే చెక్కిన విగ్రహాలను నమ్మినవారు ప్రతిమలతో, ‘మీరు మాకు దేవుళ్ళు’ అని చెప్పేవారు, చాలా సిగ్గుతో వెనుకకు తిరుగుతారు. “చెవిటి వారలారా! వినండి. చూడండి, గ్రుడ్డి వారలారా! చూడండి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపిన దూత కాకుండా మరి ఎవడు చెవిటివాడు? నాతో నిబంధన ఉన్నవాని కన్నా ఎవడు గ్రుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నీవు చాలా సంగతులను చూశావు, కాని నీవు వాటిపై శ్రద్ధ పెట్టవు; నీ చెవులు తెరచి ఉన్నాయి, కాని నీవు వినవు.” యెహోవా తన నీతిని బట్టి తన ధర్మశాస్త్రాన్ని గొప్పగా, మహిమగలదిగా చేయడానికి ఇష్టపడ్డారు. కాని ఈ ప్రజలు దోచుకోబడి కొల్లగొట్టబడ్డారు, వారందరూ గుహల్లో చిక్కుకున్నారు, చెరసాలలో దాచబడ్డారు. వారు దోచుకోబడ్డారు వారిని విడిపించే వారెవరూ లేరు. వారు దోపుడు సొమ్ముగా చేయబడ్డారు, “వారిని వెనుకకు పంపండి” అని చెప్పేవారు ఎవరూ లేరు. మీలో ఎవరు దీనిని వింటారు రాబోయే కాలంలో ఎవరు శ్రద్ధ చూపిస్తారు? యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించింది, ఇశ్రాయేలును దోపిడి చేసేవారికి అప్పగించింది ఎవరు? యెహోవా కాదా, మేము ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు కాదా? వారు ఆయన మార్గాలను అనుసరించలేదు ఆయన ధర్మశాస్త్రానికి లోబడలేదు. కాబట్టి ఆయన వారిమీద తన కోపాగ్నిని యుద్ధ వినాశనాన్నీ కుమ్మరించారు. అది వారి చుట్టూ మంటలతో చుట్టుకుంది, అయినా వారు గ్రహించలేదు; అది వారిని కాల్చింది, కాని వారు దాన్ని పట్టించుకోలేదు.

యెషయా 42:17-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

చెక్కిన విగ్రహాలపై నమ్మకముంచి, పోతవిగ్రహాలతో, “మీరే మా దేవుళ్ళు” అని చెప్పేవారు వెనక్కి మళ్ళి సిగ్గు పడతారు. చెవిటివారు వినండి, గుడ్డివారు మీరు గ్రహించగలిగేలా చూడండి. నా సేవకుడు తప్ప గుడ్డివాడు మరెవడు? నేను పంపిన నా దూత తప్ప చెవిటివాడు మరెవడు? నాతో నిబంధనలో ఉన్నవానికంటే, యెహోవా సేవకుని కంటే గుడ్డివాడు ఎవడు? నువ్వు చాలా విషయాలు చూస్తున్నావు గానీ గ్రహించలేకపోతున్నావు. చెవులు తెరిచే ఉన్నాయి గానీ వినడం లేదు. యెహోవా తన నీతికీ తన ధర్మశాస్త్రానికీ ఘనతామహిమలు కలగడంలో సంతోషించాడు. అయితే ఈ ప్రజలు దోపిడీకి గురయ్యారు. వారంతా గుహల్లో చిక్కుకుపోయారు, వారిని బంధకాల్లో ఉంచారు. వారు దోపుడు పాలైనప్పుడు వారినెవరూ విడిపించలేదు. అపహరణకు గురైనప్పుడు “వారిని తిరిగి తీసుకురండి” అని ఎవరూ చెప్పలేదు. మీలో దీన్ని ఎవడు వింటాడు? భవిష్యత్తులోనైనా ఎవడు ఆలకించి వింటాడు? వారు యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు. ఆయన మార్గాల్లో నడుచుకోలేదు. ఆయన ఉపదేశాన్ని తిరస్కరించారు. అందుకు యెహోవాయే యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించాడు. ఇశ్రాయేలును దోచుకునేవారికి అప్పగించాడు. దాని కారణంగానే ఆయన వారిమీద తన కోపాగ్నినీ యుద్ధ వినాశనాన్నీ కుమ్మరించాడు. అది వారి చుట్టూ అగ్నిని రాజబెట్టింది గానీ వారు గ్రహించలేదు. అది వారిని కాల్చింది గానీ వారు దాన్ని పట్టించుకోలేదు.

యెషయా 42:17-25 పవిత్ర బైబిల్ (TERV)

కానీ కొంతమంది మనుష్యులు నన్ను వెంబడించటం మానివేశారు. బంగారపు పూత పూయబడిన విగ్రహాలు వారికి ఉన్నాయి. ‘మీరే మా దేవుళ్లు’ అని వారు ఆ విగ్రహాలతో చెబుతారు. ఆ ప్రజలు వారి అబద్ధపు దేవుళ్లను నమ్ముతారు. కానీ ఆ ప్రజలు నీరాశ చెందుతారు.” “చెవిటి ప్రజలారా నా మాట వినాలి. గుడ్డి మనుష్యులారా మీరు కళ్లు తెరిచి, నన్ను చూడాలి. ప్రపంచం అంతటిలోకెల్లా నా సేవకుడు ఎక్కువ గుడ్డివాడు. నేను ప్రపంచంలోకి పంపించిన నా సేవకుడు మహా చెవిటివాడు. నేను ఒడంబడిక చేసుకొన్న ఆ వ్యక్తి యెహోవా సేవకుడు అందరికంటె మహా గుడ్డివాడు. ఈ సేవకుడు తాను ఏమి చేయాలో అది చూడాలి. కానీ అతడు నాకు విధేయత చూపడం లేదు. అతడు తన చెవులతో వినగలడు. కానీ అతడు నా మాట వినుటకు నిరాకరిస్తున్నాడు.” యెహోవా తన సేవకుని ఎడల న్యాయం చూపగోరుతున్నాడు. కనుక అద్భుతమైన ఉపదేశాలను యెహోవా తన ప్రజలకు చేస్తాడు. అయితే ప్రజలను చూడండి ఇతరులు వారిని ఓడించి, వారి దగ్గర దొంగిలించారు. యువకులంతా భయపడ్తున్నారు. వారు చెరలో బంధించబడ్డారు. మనుష్యులు వారి ధనం వారి దగ్గర్నుండి దోచుకొన్నారు. వారిని రక్షించేందుకు ఏ మనిషిలేడు. ఇతరులు వారి డబ్బు దోచుకొన్నారు. “దానిని తిరిగి ఇచ్చేయండి” అని చెప్పగల వాడు ఒక్కడూ లేడు. మీలో ఎవరైనా దేవుని మాట విన్నారా? లేదు. కానీ మీరు ఆయన మాటలు జాగ్రత్తగా విని, జరిగిన దానిని గూర్చి ఆలోచించాలి. యాకోబు, ఇశ్రాయేలునుండి ధనాన్ని దోచుకోనిచ్చింది ఎవరు? యెహోవాయే వారిని ఇలా చేయనిచ్చాడు. మనం యెహోవాకు విరోధంగా పాపం చేశాం. అందుచేత యెహోవా మన ధనాన్ని ఇతరులు దోచుకోనిచ్చాడు. యెహోవా కోరిన విధంగా జీవించటానికి ఇశ్రాయేలు ప్రజలు ఇష్టపడలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఉపదేశాలను వినిపించుకోలేదు. అందుచేత యెహోవా వారిమీద కోపగించాడు. యెహోవా వారి మీదకు గొప్పయుద్ధాలు వచ్చేట్టు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు వారి చుట్టూరా అగ్ని ఉన్నట్టుగా ఉంది. కానీ జరుగుతోంది ఏమిటో వారికి తెలియలేదు. వారు కాలిపోతున్నట్టే ఉంది. కానీ జరుగుతోన్న సంగతులను గ్రహించేందుకు వారు ప్రయత్నించలేదు.

యెషయా 42:17-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

చెక్కినవిగ్రహములను ఆశ్రయించి పోతవిగ్రహ ములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు. చెవిటివారలారా, వినుడి గ్రుడ్డివారలారా, మీరు గ్రహించునట్లు ఆలో చించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావువారు చెవి యొగ్గిరిగాని వినకున్నారు. యెహోవా తన నీతినిబట్టి సంతోషముగలవాడై ఉపదేశక్రమమొకటి ఘనపరచి గొప్పచేసెను. అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయెను. ఎవరును తప్పించుకొనకుండ వారందరు గుహలలో చిక్కుపడియున్నారువారు బందీగృహములలో దాచబడియున్నారు దోపుడుపాలైరి విడిపించువాడెవడును లేడు అపహరింపబడిరి తిరిగి రప్పించుమని చెప్పువాడెవడును లేడు. మీలో ఎవడు దానికి చెవి యొగ్గును? రాబోవుకాలమునకై ఎవడు ఆలకించి వినును? యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమివారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి ఆయన ఉపదేశమును వారంగీకరింపకపోయిరి యాకోబును దోపుసొమ్ముగా అప్పగించినవాడు, దోచుకొనువారికి ఇశ్రాయేలును అప్పగించినవాడు యెహోవాయే గదా? కావున ఆయన వానిమీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను అది వానిచుట్టు అగ్ని రాజచేసెను అయినను వాడు దాని గ్రహింపలేదు అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టలేదు.