యెషయా 10:21-22
యెషయా 10:21-22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మిగిలినవారు తిరిగి వస్తారు, యాకోబులో మిగిలినవారు బలవంతుడైన దేవుని వైపు తిరుగుతారు. నీ ప్రజలైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుకంత విస్తారంగా ఉన్నా, వారిలో మిగిలినవారే తిరుగుతారు. నాశనం శాసించబడింది నీతియుక్తమైన శిక్ష ఉప్పొంగి ప్రవహిస్తుంది.
యెషయా 10:21-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యాకోబులో మిగిలిన వాళ్ళు బలవంతుడైన దేవునివైపు తిరుగుతారు. ఇశ్రాయేలూ, నీ ప్రజలు సముద్రపు ఇసుకలా ఉన్నా, దానిలో మిగిలిన వాళ్ళే తిరుగుతారు. ప్రవాహంలా పారే నీతి నిర్ణయించిన ప్రకారం ఆ దేశానికి సమూల నాశనం ప్రాప్తించింది.
యెషయా 10:21-22 పవిత్ర బైబిల్ (TERV)
యాకోబు వంశంలో మిగిలిన ప్రజలు శక్తివంతుడైన దేవున్ని మరల వెంబడిస్తారు. మీ ప్రజలు చాలామంది ఉన్నారు. వారు సముద్రపు ఇసుకలా ఉన్నారు. కానీ ఆ ప్రజల్లో కొద్ది మంది మాత్రమే యెహోవా దగ్గరకు తిరిగి వచ్చేందుకు మిగిలి ఉంటారు. ఆ ప్రజలు దేవుని దగ్గరకు తిరిగి వస్తారు. కాని ముందు మీ దేశం నాశనం చేయబడుతుంది. దేశాన్ని నాశనం చేస్తానని దేవుడు ప్రకటించాడు. ఆ తర్వాత దేశానికి మంచి కలుగుతుంది. అది నిండుగా ప్రవహిస్తున్న నదిలా ఉంటుంది.